ట్రంప్ ను నమ్మొద్దు.. భారత్ కు అమెరికా ఆర్థికవేత్త హితవు
- భారత్ ఆర్థికంగా ఎదగడం ఆయనకు కంటగింపుగా మారింది
- ట్రంప్ ఆర్థిక నిరక్షరాస్యుడంటూ విమర్శలు
- విదేశాలకు సంబంధించి ఆయనది బాధ్యతారాహిత్యం అని ఫైర్
భారత్ పై ట్రంప్ టారిఫ్ లు విధిస్తున్న సమయంలో జెఫ్రీ సాచ్స్ ఈ సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తోందనే నెపంతో భారతదేశంపై ట్రంప్ 50 శాతం టారిఫ్ లు విధించిన విషయం తెలిసిందే. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం భారత్ – అమెరికా సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపింది.
అమెరికాతో అప్రమత్తంగా ఉండాలని భారత్ కు సందేశం పంపించిందని జెఫ్రీ పేర్కొన్నారు. అమెరికా మార్కెట్ ను వదిలిపెట్టి విశ్వసనీయమైన మిత్రులు రష్యా, ఆఫ్రికా, చైనా తదితర ఆసియా దేశాలతో ఆర్థిక సంబంధాలను మెరుగుపరుచుకోవాలని జెఫ్రీ సాచ్స్ సూచించారు.