RS Praveen Kumar: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఇతర నేతలను వెంటనే విడుదల చేయాలి: కేటీఆర్

KTR Demands Release of RS Praveen Kumar and Other Leaders
  • పోడు భూముల పట్టాల కోసం పోరాడుతున్న నేతలను అక్రమంగా అరెస్ట్ చేశారన్న కేటీఆర్
  • రేవంత్ ప్రభుత్వ గూండాగిరికి ఇది నిదర్శనమని మండిపాటు
  • పోడు రైతులకు వెంటనే పట్టాలు ఇవ్వాలని డిమాండ్
బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సహా పలువురు ఇతర నేతలను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పోడు భూముల పట్టాల కోసం పోరాడుతున్న కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా దిందా రైతులకు అండగా నిలిచినందుకు బీఆర్ఎస్ నేతలను అక్రమంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు.  

రైతుల చేతికి సంకెళ్లు వేశారని, వారి కోసం పోరాడుతున్న వారిని అక్రమంగా అరెస్ట్ చేశారని... ఇది రేవంత్ ప్రభుత్వ గూండాగిరికి నిదర్శనమని కేటీఆర్ విమర్శించారు. పోడు రైతులను వేధించడం మాని, వారికి వెంటనే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలీసుల అదుపులో ఉన్న ప్రవీణ్ కుమార్, ఇతర బీఆర్ఎస్ నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ పతనం దగ్గర్లోనే ఉందని అన్నారు.

RS Praveen Kumar
KTR
BRS
Telangana
Revanth Reddy
Podu lands
Kumram Bheem Asifabad
Telangana Politics
Farmers Protest
Arrests

More Telugu News