Darshan Thoogudeepa: నటుడు దర్శన్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. హత్య కేసులో బెయిల్ రద్దు

Darshan Supreme Court setback bail cancelled in murder case
  • అభిమాని హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దర్శన్ తూగుదీప
  • కర్ణాటక హైకోర్టు మంజూరు చేసిన బెయిలును రద్దు చేసిన సుప్రీంకోర్టు
  • నిందితుడు ఎంత పెద్దవాడైనా చట్టానికి అతీతుడు కాదన్న ధర్మాసనం
కన్నడ సినీ నటుడు దర్శన్ తూగుదీపకు సుప్రీంకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. హత్య కేసులో కర్ణాటక హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. జస్టిస్ జేబీ పర్దివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది.

హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. "బెయిల్ మంజూరు, రద్దు అంశాలను మేం పరిశీలించాం. ఈ కేసులో హైకోర్టు నిర్ణయం పూర్తిగా యాంత్రికంగా తీసుకున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. బెయిల్ మంజూరు చేయడం వల్ల విచారణపై ప్రభావం పడుతుంది, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది" అని జస్టిస్ మహదేవన్ వ్యాఖ్యానించారు. 

ఈ కేసులో జస్టిస్ మహదేవన్ రాసిన తీర్పును జస్టిస్ పర్దివాలా కొనియాడారు. "జస్టిస్ మహదేవన్ చాలా అద్భుతమైన తీర్పు ఇచ్చారు. ఇది అనిర్వచనీయం. నిందితుడు ఎంత పెద్దవాడైనా చట్టానికి అతీతుడు కాదని ఈ తీర్పు స్పష్టం చేస్తుంది" అని పేర్కొన్నారు.
Darshan Thoogudeepa
Darshan murder case
Kannada actor
Supreme Court
Bail cancellation
Karnataka High Court
Indian court
Crime news

More Telugu News