: వైసీపీకి షాక్... ఒంటిమిట్ట తొలి రౌండ్ కౌంటింగ్ లో టీడీపీకి భారీ ఆధిక్యత

  • కొనసాగుతున్న పులివెందుల, ఒంటిమిట్ట ఉప ఎన్నికల కౌంటింగ్
  • ఒంటిమిట్టలో తొలి రౌండ్ లో 3,421 ఓట్ల ఆధిక్యత సాధించిన టీడీపీ
  • టీడీపీకి 4,632 ఓట్లు.. వైసీపీకి 1,211 ఓట్లు
కడప జిల్లా పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. కడపలో భారీ బందోబస్తు మధ్య ఓట్ల లెక్కింపు జరుగుతోంది. తాజాగా ఒంటిమిట్ట తొలి రౌండ్ ఫలితాలు వెలువడ్డాయి. తొలి రౌండ్ లో వైసీపీకి భారీ షాక్ తగిలింది. టీడీపీ పూర్తి ఆధిక్యతను ప్రదర్శించింది. తొలి రౌండ్ లో టీడీపీ అభ్యర్థి అద్దలూరు ముద్దుకృష్ణారెడ్డికి 4,632 ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డికి 1,211 ఓట్లు మాత్రమే వచ్చాయి. తొలి రౌండ్ లో వైసీపీ అభ్యర్థిపై టీడీపీ అభ్యర్థి 3,421 ఓట్ల ఆధిక్యతను సాధించారు. 

పులివెందుల జడ్పీటీసీ కౌంటింగ్ ఇంకా కొనసాగుతోంది. ఒక్క రౌండ్ లోనే పులివెందుల కౌంటింగ్ ను పూర్తి చేయనున్నారు. ఒంటిమిట్ట కౌంటింగ్ మాత్రం మూడు రౌండ్ల వరకు కొనసాగే అవకాశం ఉంది. ఈ రెండు స్థానాల్లో గెలుపు తమదేనని టీడీపీ శ్రేణులు ధీమాగా ఉన్నాయి.

More Telugu News