YS Jagan: ఏపీ ఎన్నికలపై జగన్ వ్యాఖ్యలు.. తీవ్రంగా స్పందించిన తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ

YS Jagan Remarks on AP Elections Draw Strong Reaction from Telangana Congress MP
  • ఏపీ ఎన్నికలపై రాహుల్ గాంధీ మాట్లాడలేదన్న జగన్
  • చంద్రబాబు, రేవంత్ రెడ్డిల కారణంగానే మాట్లాడలేదని విమర్శ
  • అలాంటి వ్యాఖ్యలు సరికాదన్న చామల కిరణ్ కుమార్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై రాహుల్ గాంధీ మాట్లాడలేదంటూ ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. 

రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలపై జగన్ చేసిన వ్యాఖ్యలు సరికాదని అన్నారు. చంద్రబాబు, రేవంత్ రెడ్డి వల్లే రాహుల్ మాట్లాడలేదని ఆరోపించడం సముచితం కాదన్నారు. ఎన్నికల్లో ఓడిపోయినా జగన్ ఆలోచనా విధానం మారలేదని విమర్శించారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఏమైనా తప్పులు జరిగినట్లు భావిస్తే ఎన్నికల కమిషన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని విమర్శించవచ్చని, కానీ రాహుల్ గాంధీని తప్పుపట్టడమేమిటని ఆయన ప్రశ్నించారు. విజయవాడలో ధర్నాలో రాహుల్ గాంధీతో కలిసి జగన్ పాల్గొనాలని సూచించారు

బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో జగన్... రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు, రేవంత్ రెడ్డికి సాన్నిహిత్యం ఉండటం వల్ల ఆయన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల గురించి మాట్లాడలేదని జగన్ ఆరోపించారు. 

YS Jagan
AP Elections
Andhra Pradesh Elections
Rahul Gandhi
Chamala Kiran Kumar Reddy
Telangana Congress

More Telugu News