Keerthi Pandian: ఓటీటీలో ముచ్చెమటలు పట్టించే తమిళ థ్రిల్లర్!

Akkenam Movie Update
  • తమిళంలో రూపొందిన 'అక్కెనమ్'
  • జులైలో విడుదలైన సినిమా
  • ప్రధానమైన పాత్రలో అరుణ్ పాండియన్ కూతురు  
  • ఈ నెల 15వ తేదీ నుంచి స్ట్రీమింగ్ 
  • మూడు పాత్రల చుట్టూ తిరిగే కథ  

ఇప్పుడు వారం తిరిగే సరికి ఓటీటీ ట్రాక్ పైకి బోలెడంత కంటెంట్ వచ్చి పడుతోంది. ఇక్కడ ఖర్చుకంటే కంటెంట్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. చిన్న సినిమానా? .. పెద్ద సినిమానా? .. భారీ తారాగణంతో కూడిన వెబ్ సిరీస్ నా? అనే తేడాలు ఆడియన్స్ పట్టించుకోరు. కంటెంట్ ఇంట్రెస్టింగ్ గా ఉంటేనే వర్కౌట్ అవుతుంది .. లేదంటే లేదు. ఈ నేపథ్యంలో వచ్చిన చిన్న సినిమాలు కొన్ని థియేటర్ల దగ్గర కంటే ఓటీటీ సెంటర్స్ ల దగ్గర ఎక్కువ సందడి చేస్తున్నాయి.

మలయాళ .. తమిళ సినిమా మేకర్స్ ఈ మధ్య కాలంలో తక్కువ బడ్జెట్ లో .. తక్కువ పాత్రలతో  ప్రయోగాలు చేస్తున్నారు. అలాంటి సినిమాలు జాబితాలో 'అక్కెనమ్' కూడా కనిపిస్తుంది. ఉదయ్ కె దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ ఏడాది జులై 4వ తేదీన థియేటర్లకు వచ్చింది. అరుణ్ పాండియన్ కూతురు కీర్తి పాండియన్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమా, ఇప్పుడు ఓటీటీ ద్వారా ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతోంది. యాక్షన్ తో కూడుకున్న ఈ క్రైమ్ థ్రిల్లర్, ఈ నెల 15వ తేదీ నుంచి 'ఆహా తమిళ్'లో స్ట్రీమింగ్ కానుంది. 

ఈ కథ మూడు పాత్రల చుట్టూ తిరుగుతుంది. ఆ మూడు పాత్రలలో ఒక లేడీ క్యాబ్ డ్రైవర్ .. నేరచరిత్ర కలిగిన యువకుడు .. టెక్ క్రిమినల్ కనిపిస్తారు. ఈ ముగ్గురి దారులు వేరు .. చేరాలనుకున్న గమ్యాలు వేరు. కానీ ఒకానొక ఊహించని సంఘటన ఆ ముగ్గురినీ కలుపుతుంది. ఆ సంఘటన ఏమిటి?  అప్పటి నుంచి వాళ్ల జీవితాలు ఎలాంటి మలుపులు తీసుకుంటాయి? చివరికి ఏ తీరానికి చేరుకుంటాయి? అనేది కథ. 

Keerthi Pandian
Akkenam movie
Akkenam review
Aha Tamil
Tamil thriller movies
OTT releases
Crime thriller
Tamil movies 2024
Udhay K movie

More Telugu News