: ప్రభుత్వ అసమర్థత కారణంగా అంతర్జాతీయ స్థాయి ఎకో పార్క్ పనులు నిలిచిపోయాయి: కేటీఆర్
- కొత్వాల్ గూడ ఎకో పార్క్ ఆలస్యంపై కేటీఆర్ ఫైర్
- రేవంత్ ప్రభుత్వం ప్రజా సేవను పక్కన పెట్టిందని మండిపాటు
- నిస్సహాయ ప్రభుత్వంలో నిస్సహాయ పాలన సాగుతోందని విమర్శ
హైదరాబాద్ కొత్వాల్ గూడ ఎకో పార్క్ ఆలస్యంపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రేవంత్ ప్రభుత్వం ప్రజా సేవను పక్కన పెట్టి రాజకీయాలు, ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తోందని విమర్శించారు. ప్రభుత్వ అసమర్థత వల్లే కొత్వాల్ గూడ ఎకో పార్క్ పనులు నిలిచిపోయాయని అన్నారు. రెండేళ్ల క్రితమే ఎకో పార్క్ మెజార్టీ పనులను బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేసిందని చెప్పారు.
హైదరాబాదీల కోసం నిర్మించిన అంతర్జాతీయ పార్క్ ఇది అని కేటీఆర్ అన్నారు. ఈరోజు వరకు పార్క్ పనులు పూర్తి కాని పరిస్థితి నెలకొందని అసహనం వ్యక్తం చేశారు. నగర ప్రతిష్ఠను పెంచే ఈ ప్రాజెక్ట్ ప్రభుత్వ అశక్తత, అధికారుల నిర్లక్ష్యం కారణంగా నిలిచిపోయిందని దుయ్యబట్టారు. నిస్సహాయ ప్రభుత్వ హయాంలో నిస్సహాయ పాలన కొనసాగుతోందని విమర్శించారు.
ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని హిమాయత్ సాగర్ పక్కన 85 ఎకరాల్లో ఈ పార్క్ ను హెచ్ఎండీఏ అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికే ఈ పార్క్ లో పక్షిశాలను ఏర్పాటు చేసి... దాదాపు 1,500 రకాల పక్షులను సేకరించి ఇక్కడి వాతావరణానికి అలవాటు చేస్తున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు ఒక రోజంతా అక్కడే గడిపేలా పలు అడ్వెంచరస్ గేమ్స్ ను కూడా రూపొందిస్తున్నారు. క్లైంబింగ్ వాల్, రోలర్ కోస్టర్, స్కై బ్రిడ్జ్, జాయింట్ స్వింగ్, హ్యూమన్ స్లింగ్ షాట్, జిప్ బైక్, 360 డిగ్రీల ఫ్లయింగ్ సైకిల్, రోప్ కోర్స్, బంగా ట్రంప్ లైన్ వంటివి ఇందులో ఏర్పాటు చేయనున్నారు.