Vitamin K1: గుండె జబ్బులను 43 శాతం వరకు తగ్గించే అద్భుతమైన విటమిన్ ఇదే!

Vitamin K1 Reduces Heart Disease Risk by 43 Percent
  • ఇటీవలి కాలంలో పెరుగుతున్న హృద్రోగ మరణాలు
  • విటమిన్ కే1ను నిత్యం తీసుకోవడం ద్వారా తగ్గనున్న గుండె జబ్బుల ముప్పు
  • 70 ఏళ్లు పైబడిన 1,400 మంది మహిళలపై 14 ఏళ్ల పాటు జరిపిన పరిశోధనలో వెల్లడి
ఇటీవలి కాలంలో హృదయ సంబంధిత వ్యాధులతో మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. అయితే, ఈ ముప్పును గణనీయంగా తగ్గించే విటమిన్‌ను తాజా అధ్యయనం గుర్తించింది. విటమిన్ ‘కే1’ను నిత్యం తీసుకోవడం వల్ల గుండె జబ్బుల ముప్పు గణనీయంగా తగ్గుతుందని అధ్యయనం తెలిపింది. విటమిన్ కే1ను సరైన మోతాదులో తీసుకోవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని 43 శాతం వరకు తగ్గించుకోవచ్చని అధ్యయనం వివరించింది. 

'ది అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్'లో ఈ అధ్యయన వివరాలు ప్రచురితమయ్యాయి. 70 ఏళ్లు పైబడిన 1,400 మంది మహిళలపై 14 సంవత్సరాల పాటు జరిపిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. ఈ పరిశోధనలో భాగంగా రోజుకు 120 మిల్లీ గ్రాముల విటమిన్ K1 తీసుకున్నవారికి, గుండె సంబంధిత వ్యాధుల వల్ల వచ్చే మరణాల ప్రమాదం తక్కువగా ఉందని కనుగొన్నారు.

విటమిన్ K1 ఎలా పనిచేస్తుంది?
మన శరీరంలోని ధమనుల్లో కాల్షియం పేరుకుపోవడం వల్ల అవి గట్టిపడతాయి. ఈ పరిస్థితి వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం పెరుగుతుంది. విటమిన్ కే1, మ్యాట్రిక్స్ జీఎల్ఏ ప్రొటీన్ (ఎంజీపీ) అనే రసాయనాన్ని సక్రియం చేయడం ద్వారా, ధమనుల్లో కాల్షియం పేరుకుపోకుండా నిరోధిస్తుంది. ఈ ప్రక్రియ వల్ల ధమనులు ఆరోగ్యంగా ఉంటాయి, గుండె కూడా సురక్షితంగా ఉంటుంది.

విటమిన్ కే1 ఎందులో ఉంటుంది?
ఆకుకూరలైన పాలకూర, బ్రకోలీ వంటి వాటిలో విటమిన్ కే1 పుష్కలంగా లభిస్తుంది. రోజుకు ఒకటి నుంచి ఒకటిన్నర కప్పుల ఆకుకూరలు తీసుకోవడం వల్ల మన శరీరానికి కావలసినంత విటమిన్ కే1 లభిస్తుంది. అయితే, వార్ఫరిన్ వంటి రక్తం పలచబరిచే మందులు వాడేవారు, ఆహారంలో ఏమైనా మార్పులు చేసే ముందు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.
Vitamin K1
Heart Health
Cardiovascular Disease
Vitamin K1 benefits
American Journal of Clinical Nutrition
Calcium
Leafy Greens
Broccoli
MGP Protein
Warfarin

More Telugu News