Shruti Haasan: అగ్ర హీరోలు ఉన్నా.. ఆ భయం మాత్రం లేదు: శ్రుతి హాసన్

Shruti Haasan Comments on Lokesh Kanagarajs Filming
  • కూలీ మూవీని లోకేశ్ అద్భుతంగా రూపొందించారన్న శ్రుతి హాసన్
  • వరుస విజయాలు అందుకున్న లోకేశ్ కూలీతో మరోసారి అందరినీ ఆశ్చర్యపరుస్తారన్న శ్రుతి
  • లోకేశ్ మూవీల్లో భావోద్వేగాలతో పాటు వినోదానికి లోటు ఉండదన్న శ్రుతి
ప్రముఖ కథానాయకుడు రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ప్రీతి పాత్రలో శ్రుతి హాసన్ నటించారు. ఆమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో లోకేశ్ కనగరాజ్ ప్రతిభను ప్రశంసించారు.

ఈ సినిమాలో అగ్ర హీరోలు రజనీకాంత్, నాగార్జున, అమీర్ ఖాన్ వంటి ఎంతోమంది ఉన్నప్పటికీ, తన పాత్ర గుర్తింపు విషయంలో ఎలాంటి భయం లేదని ఆమె అన్నారు. లోకేశ్ ఈ చిత్రాన్ని అద్భుతంగా రూపొందించారని, ప్రీతి పాత్రకు న్యాయం చేకూరేలా స్క్రిప్ట్ రాశారని ఆమె తెలిపారు.

ఖైదీ, మాస్టర్, విక్రమ్ వంటి చిత్రాలతో వరుస విజయాలు సాధించిన లోకేశ్.. కూలీతో మరోసారి అందరినీ ఆశ్చర్యపరుస్తారని శ్రుతి హాసన్ అన్నారు. లోకేశ్ సినిమాల్లో ప్రేక్షకులకు నచ్చే యాక్షన్ సన్నివేశాలు, భావోద్వేగాలు, వినోదం పుష్కలంగా ఉంటాయని ఆమె పేర్కొన్నారు. కూలీ చిత్రం ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గదని, ప్రీతి పాత్ర మహిళలందరికీ నచ్చుతుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. 
Shruti Haasan
Lokesh Kanagaraj
Coolie Movie
Rajinikanth
Tamil Cinema
Action Thriller
Preeti Character
Khiladi
Master Movie

More Telugu News