Indian Restaurant: ఇండియన్ రెస్టారెంట్‌లో ఫుల్లుగా తిని.. బిల్లు కట్టకుండా పారిపోయిన యువకులు.. వీడియో వైరల్!
- ఇంగ్లండ్‌లోని భారతీయ రెస్టారెంట్‌లో నలుగురు యువకుల నిర్వాకం
- సుమారు రూ. 23,000 విలువైన భోజనం చేసి బిల్లు చెల్లించకుండా పరారీ
- యువకులు పారిపోతున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డు
- వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన రెస్టారెంట్ యాజమాన్యం
- ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న స్థానిక పోలీసులు
ఇంగ్లండ్‌లోని నార్తాంప్టన్‌లో ఉన్న ఒక భారతీయ రెస్టారెంట్‌లో నలుగురు యువకులు దుశ్చర్యకు పాల్పడ్డారు. కడుపునిండా భోజనం చేసి, సుమారు 197.30 పౌండ్లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 23,000) బిల్లు చెల్లించకుండా పారిపోయారు. ఈ ఘటన మొత్తం రెస్టారెంట్‌లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కాగా, ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళితే.. నార్తాంప్టన్‌లోని ‘సాఫ్రాన్’ అనే భారతీయ రెస్టారెంట్‌కు ఈ నెల 4న రాత్రి సుమారు 10:15 గంటలకు నలుగురు యువకులు వచ్చారు. వారు లాంబ్ చాప్స్, వివిధ రకాల కూరలతో కూడిన ఖరీదైన భోజనాన్ని ఆర్డర్ చేసి ఆరగించారు. భోజనం ముగిసిన తర్వాత, సిబ్బంది కళ్లుగప్పి ఒక్కసారిగా కుర్చీలలో నుంచి లేచి బయటకు పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమైన ఒక వెయిటర్ వారిని పట్టుకోవడానికి వెంబడించినా ప్రయోజనం లేకపోయింది.
ఈ ఘటనపై రెస్టారెంట్ యాజమాన్యం ఫేస్‌బుక్ ద్వారా ఆవేదన వ్యక్తం చేసింది. "ఇలాంటి ప్రవర్తన కేవలం దొంగతనం మాత్రమే కాదు, కష్టపడి పనిచేసే చిన్న వ్యాపారాలను, స్థానిక సమాజాన్ని దెబ్బతీస్తుంది. నిందితులను గుర్తించడంలో సహాయం చేయండి" అని కోరుతూ సీసీటీవీ ఫుటేజీని, వారు తిన్న భోజనం బిల్లును పోస్ట్ చేసింది. చుట్టుపక్కల వ్యాపారులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఈ సంఘటనపై నార్తాంప్టన్‌షైర్ పోలీసులు దొంగతనం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల గురించి ఏమైనా సమాచారం తెలిస్తే 101 నంబర్‌కు ఫోన్ చేసి తెలియజేయాలని ప్రజలను కోరారు.
ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. "డబ్బులు చెల్లించలేనప్పుడు ఇంట్లోనే తినాలి కదా" అని ఒకరు వ్యాఖ్యానించగా, "ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి" అని మరొకరు కామెంట్ చేశారు. ఈ ప్రవర్తన సిగ్గుచేటని, నిందితులను వెంటనే పట్టుకోవాలని పలువురు నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.