Rajinikanth: తెలుగు రాష్ట్రాల్లో వార్-2, కూలీ టికెట్ రేట్ల వివరాలు

Rajinikanths Coolie and NTRs War 2 Ticket Prices in Telugu States
  • ఆగస్టు 15న విడుదల అవుతున్న భారీ బడ్జెట్ మూవీలు వార్ 2, కూలీ 
  • తెలుగు రాష్ట్రాల్లో ఓపెన్ అయిన టికెట్ బుకింగ్స్
ఈ ఆగస్టు 15న ప్రేక్షకులను అలరించడానికి రెండు భారీ బడ్జెట్ మూవీలు కూలీ, వార్ 2 సిద్ధమయ్యాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ; ఎన్టీఆర్, హృతిక్ ప్రధాన పాత్రలలో నటించిన వార్ 2 మూవీలు విడుదల కానుండగా, ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో ఈ మూవీకి సంబంధించిన బుకింగ్స్ ఓపెన్ అవ్వడంతో టికెట్లు హాట్ కేక్‌ల్లా అమ్ముడయ్యాయి.

తెలుగు రాష్ట్రాల్లో టికెట్ బుకింగ్స్ ఎప్పుడెప్పుడు ఓపెన్ అవుతాయా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. నిన్న సాయంత్రం నుంచి బుక్ మై షో, డిస్ట్రిక్ట్ యాప్‌లలో టికెట్స్ అందుబాటులోకి వచ్చాయి.

అయితే ఈ రెండు మూవీలకు తెలంగాణలో టికెట్ ధరల పెంపు లేదు. సింగిల్ స్క్రీన్‌లలో రూ.175, మల్టీ ప్లెక్స్‌లలో రూ.295కే టికెట్లు లభిస్తున్నాయి. మార్నింగ్ షో కన్నా ముందు కేవలం ఒక్క షోకు మాత్రమే అనుమతి లభించినట్లు తెలుస్తోంది. అందుకు అనుగుణంగా థియేటర్లకు అనుమతినిచ్చారు. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య ఈ స్పెషల్ షోను ప్రదర్శించనున్నారు. ఈ రెండు మూవీలకు భారీ డిమాండ్ ఉండటంతో స్పెషల్ షోలకు థియేటర్లు కేటాయించే విషయంలో చాలా కసరత్తు జరిగినట్లు తెలుస్తోంది.

ఇక ఏపీ విషయానికి వస్తే.. కూలీ మూవీ విడుదల రోజు అదనపు షోకు (ఉదయం 5 గంటలు) ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సింగిల్ స్క్రీన్‌లో రూ.75 (జీఎస్టీతో కలిపి), మల్టీ ప్లెక్స్‌ల్లో రూ.100 (జీఎస్టీతో కలిపి) పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఆగస్టు 14 నుంచి ఆగస్టు 23 వరకూ ఈ ధరలు అమలులో ఉండనున్నాయి.

అలాగే, వార్ 2 మూవీ స్పెషల్ షోకు కూడా ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆ అదనపు షో టికెట్ ధర రూ.500గా (జీఎస్టీతో కలిపి) నిర్ణయించారు. ఆగస్టు 14 నుండి 23 వరకు సింగిల్ స్క్రీన్ లో రూ.75 (జీఎస్టీతో కలిపి), మల్టీ ప్లెక్స్ ల్లో రూ.100 (జీఎస్టీతో కలిపి) టికెట్ ధరల పెంపుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. 
Rajinikanth
Coolie movie
War 2 movie
NTR
Hrithik Roshan
Telugu states
ticket prices
movie bookings
Andhra Pradesh
Telangana

More Telugu News