Sariya Waterfall: ఏపీలోని సరియా జలపాతం వద్ద చిక్కుకుపోయిన పర్యాటకులు

Sariya Waterfall Tourists Rescued in AP
  • అనకాపల్లి జిల్లాలోని సరియా జలపాతం చూసేందుకు వెళ్లిన 36 మంది పర్యాటకులు
  • రెవెన్యూ, పోలీస్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని అప్రమత్తం చేసిన కలెక్టర్, ఎస్పీ
  • పర్యాటకులను కాపాడిన రెస్క్యూ సిబ్బంది
అనకాపల్లి జిల్లాలోని సరియా జలపాతం వద్ద కొందరు పర్యాటకులు చిక్కుకుపోగా, పోలీసులు మరియు అగ్నిమాపక సిబ్బంది వారిని రక్షించారు.

వివరాల్లోకి వెళితే, విశాఖపట్నంకు చెందిన 36 మంది పర్యాటకులు నిన్న సరియా జలపాతాన్ని సందర్శించడానికి వెళ్లారు. వారు అక్కడ ఉండగా భారీ వర్షం కురవడం వల్ల సరియా నదికి వరద రావడంతో వారు నదికి ఆవల చిక్కుకుపోయారు.

ఈ విషయం తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, ఎస్పీ తుహాన్ సిన్హా స్పందించి రెవెన్యూ అధికారులు, పోలీసులు, మరియు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఎస్పీ తుహాన్ సిన్హా, దేవరాపల్లి ఎస్ఐ సత్యనారాయణతో పాటు అగ్నిమాపక సిబ్బందిని వెంటనే సంఘటనా స్థలానికి పంపారు.

సహాయక బృందాలు నదికి ఆవల చిక్కుకున్న పర్యాటకులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. దేవరాపల్లి వద్ద అనకాపల్లి డీఎస్పీ శ్రావణి, కె. కోటపాడు సీఐ పైడపునాయుడు పర్యాటకులకు పునరావాసం ఏర్పాటు చేశారు. 
Sariya Waterfall
Anakapalle district
Andhra Pradesh tourism
Tourist rescue
Heavy rain
NDRF
Vishakapatnam tourists
Vijay Krishnan
Tuhan Sinha

More Telugu News