రేపటి నుంచి మూడు రోజులు బయటకు రావొద్దు: హైదరాబాద్ ప్రజలకు హైడ్రా హెచ్చరిక
- 13, 14, 15 తేదీల్లో ప్రజలు బయటకు రావొద్దన్న హైడ్రా
- మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడి
- అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచన
మేడ్చల్ జిల్లాతో పాటు సైబరాబాద్ పరిధిలో భారీ వర్షాలు కురుస్తాయని హైడ్రా వెల్లడించింది. 10 నుంచి 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, కొన్ని ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. వచ్చే మూడు రోజులు ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని హైడ్రా విజ్ఞప్తి చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.