Pulivendula: కాల్చి పడేస్తా... వైసీపీ కార్య‌క‌ర్త‌లకు డీఎస్పీ వార్నింగ్‌.. వీడియో వైరల్

Koya Praveen DSP warns YSRCP leaders in Pulivendula video goes viral
  • కొన‌సాగుతున్న పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల‌ పోలింగ్
  • ఎంపీ వైఎస్‌ అవినాశ్‌ రెడ్డి నిర్బంధంతో పులివెందులలో ఉద్రిక్తత‌
  • పులివెందుల వైసీపీ కార్యాల‌యానికి త‌ర‌లివ‌చ్చిన నేత‌లు, కార్య‌క‌ర్త‌లు
  • వారిని అక్క‌డి నుంచి వెళ్లిపోవాల‌ని కోరిన పోలీసులు
  • ఈ క్ర‌మంలో పోలీసుల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు వాగ్వాదం
  • ఆగ్ర‌హానికి గురైన డీఎస్పీ మురళీ నాయక్... వైసీపీ కార్యకర్తలపై ఫైర్  
పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల‌ పోలింగ్ కొన‌సాగుతోంది.  పులివెందులలోని వైసీపీ కార్యాలయం వద్ద మంగళవారం తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. డీఎస్పీ మురళి నాయక్, వైసీపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోవడంతో అక్కడ కొంతసేపు గందరగోళం ఏర్పడింది.

వివరాల్లోకి వెళితే, పులివెందులలో జరుగుతున్న జెడ్పీటీసీ ఉప ఎన్నికల నేపథ్యంలో డీఐజీ కోయ ప్రవీణ్‌తో పాటు డీఎస్పీ మురళి నాయక్ భారీ పోలీసు బలగాలతో వైసీపీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఉన్నతాధికారులు పెద్ద సంఖ్యలో పోలీసులతో పార్టీ కార్యాలయం వద్దకు రావడంతో స్థానిక వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు గురయ్యారు. తమ నాయకుడికి ఏదో జరుగుతుందనే ఆందోళనతో పెద్ద సంఖ్యలో అక్కడికి పరుగులు తీశారు.

దీంతో అక్కడ ఒక్కసారిగా జనం గుమిగూడారు. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు డీఎస్పీ మురళి నాయక్ ప్రయత్నించారు. గుంపుగా ఉన్న కార్యకర్తలను అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. ఈ నేప‌థ్యంలో ఆగ్ర‌హానికి గురైన డీఎస్పీ మురళి నాయక్ వైసీపీ కార్యకర్తలపై ఫైర్ అయ్యారు. "కాల్చిపడేస్తా నా కొ..కా.. నువ్వు తాగి మాట్లాడొద్దు... ఏమనుకుంటున్నావ్‌.. యూనిఫాం ఇక్కడ!" అంటూ గ‌ట్టిగా హెచ్చ‌రించారు. డీఎస్పీ వార్నింగ్ తాలూకు వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
Pulivendula
Koya Praveen
YSRCP
TDP
Kadapa
ZPTC Elections
Andhra Pradesh Politics
Police Warning
Election Rigging
YS Avinash Reddy

More Telugu News