: పులివెందుల ఉప ఎన్నికకు వైసీపీ రూ. 100 కోట్లు ఖర్చు చేసింది: బీటెక్ రవి
- పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభం
- పోలింగ్ ప్రారంభమైన తర్వాత కూడా వైసీపీ డబ్బులు పంచుతోందన్న బీటెక్ రవి
- అవినీతి సొమ్మును ఉప ఎన్నిక గెలుపు కోసం కుమ్మరిస్తున్నారని మండిపాటు
పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభమయింది. ఈ ఎన్నికల్లో విజయాన్ని అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. గెలుపు కోసం ఇరు పక్షాలు సర్వశక్తులను ఒడ్డాయి. ఉప ఎన్నికల ప్రచార ప్రక్రియ యుద్ధాన్ని తలపించింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. మరోవైపు, ఇప్పటికే కడప వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి, వైసీపీ నేత సతీశ్ రెడ్డి లను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
పోలింగ్ ప్రారంభమైన తర్వాత టీడీపీ నేత బీటెక్ రవి మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికకు వైసీపీ రూ. 100 కోట్లు ఖర్చు చేసిందని ఆరోపించారు. పోలింగ్ ప్రారంభమైన తర్వాత కూడా ఓటుకు రూ. 5 వేల చొప్పున వైసీపీ నేతలు డబ్బులు పంచుతున్నారని మండిపడ్డారు. మహిళలకు చీరలు, ముక్కు పుడకలు పంపిణీ చేశారని దుయ్యబట్టారు. ఐదేళ్ల పాటు అక్రమంగా సంపాదించిన అవినీతి సొమ్మును పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక గెలుపు కోసం కుమ్మరిస్తున్నారని ఆరోపించారు.