YS Avinash Reddy: రేపే పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక.. ఈసీపై అవినాశ్ రెడ్డి విమర్శలు

Pulivendula By Election Controversy YS Avinash Reddy Slams EC
  • పోలింగ్ బూత్ లను మార్చడం వల్ల ఎవరి ఓటు ఎక్కడుందో అర్థం కాని పరిస్థితి ఉందన్న అవినాశ్
  • టీడీపీ నేతలు డబ్బులు పంచుతున్నారని ఆరోపణ
  • నల్లపరెడ్డిపల్లెకు బయటి వ్యక్తులు భారీగా వచ్చారన్న అవినాశ్
ఎన్నికల సంఘంపై వైసీపీ కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. పోలింగ్ బూత్ లను మార్చడం వల్ల ఎవరి ఓటు ఎక్కడుందో ఓటరుకి అర్థం కాని పరిస్థితి ఉందని... రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని చెప్పారు. ఓటరుకి ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని కల్పించాలని తెలిపారు. 

నల్లపరెడ్డిపల్లె, నల్లగొండువారిపల్లె, కొత్లపల్లెలో టీడీపీ నేతలు ఇంటింటికి వెళ్లి ఓటరు స్లిప్పులు తీసుకుంటున్నారని తెలిపారు. ఇంటింటికి వెళ్లి డబ్బులు పంచుతున్నారని, డబ్బులిచ్చి ఓటరు స్లిప్పులను వెనక్కి తీసుకుంటున్నారని మండిపడ్డారు. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ... ఎలాంటి స్పందన లేదని మండిపడ్డారు. 

నల్లపరెడ్డిపల్లెకి బయటి వ్యక్తులు భారీగా వచ్చారని... వారికి ఈ స్లిప్పులను ఇచ్చి దొంగ ఓట్లు వేయించబోతున్నారని అన్నారు. రిగ్గింగ్ చేసినట్టు కెమెరాల్లో కనిపించకుండా ఇలా ప్లాన్ చేశారని విమర్శించారు. మరోవైపు రేపు ఉదయం నుంచి పులివెందుల జడ్పీటీసీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది.
YS Avinash Reddy
Pulivendula
ZPTC Election
Andhra Pradesh Elections
YSRCP
TDP
Election Commission
Kadapa
Voter Fraud

More Telugu News