YS Sharmila: మోదీ ఓట్ల దొంగ కాబట్టే మౌనంగా ఉన్నారు: షర్మిల
- ఓట్ చోర్ క్యాంపెయిన్ ను ప్రతి ఇంటికి చేరుస్తామన్న షర్మిల
- నకిలీ ఓటర్ల జాబితా ఎందుకు తారుమారయిందని ప్రశ్న
- బీజేపీ చేతిలో ఈసీ కీలుబొమ్మగా మారిందని విమర్శ
బీజేపీ, ఈసీకి వ్యతిరేకంగా'ఓట్ చోర్ క్యాంపెయిన్'ను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఏపీలో సైతం ఈ కార్యక్రమాన్ని ప్రతి గడపకు చేరుస్తామని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తెలిపారు. ఓట్ల దొంగ మోదీ తీరును, బీజేపీ కోసం అధికార దుర్వినియోగం చేసిన ఎన్నికల కమిషన్ వైఖరిని ఎండగడతామని చెప్పారు. ప్రజాస్వామ్యమే ఈసీకి ముఖ్యమని భావిస్తే... రాహుల్ గాంధీ లేవనెత్తిన సందేహాలకు బదులివ్వాలని డిమాండ్ చేశారు.
నకిలీ ఓటర్ల జాబితా ఎందుకు తారుమారయిందని షర్మిల ప్రశ్నించారు. డిజిటల్ ఓటర్ జాబితాను ఎందుకు ఇవ్వడం లేదని మండిపడ్డారు. ప్రతిపక్ష నేతలను ఎందుకు బెదిరిస్తున్నారని ప్రశ్నించారు. బీజేపీకి ఎన్నికల సంఘం ఏజెంట్ గా మారిందా? అని నిలదీశారు.
దొడ్డిదారిలో గెలుపు కోసం ఎన్నికల కమిషన్ నే బీజేపీ కలుషితం చేసిందని షర్మిల మండిపడ్డారు. స్వతంత్ర వ్యవస్థ అయిన ఈసీ బీజేపీ చేతిలో కీలుబొమ్మగా మారిందని, ఆర్ఎస్ఎస్ లాంటి అనుబంధ సంస్థల జాబితాలో చేరిందని విమర్శించారు. మోదీ ఓట్ల దొంగ కాబట్టే మౌనంగా ఉంటున్నారని అన్నారు.