Shashi Tharoor: ఇండియా కూటమి ర్యాలీలో ప్రత్యక్షమైన శశిథరూర్

Shashi Tharoor Appears at India Alliance Rally
  • కొంత కాలంగా కాంగ్రెస్ తో అంటీముట్టనట్టుగా ఉన్న శశిథరూర్
  • నేడు ఎలెక్షన్ కమిషన్ కు వ్యతిరేకంగా ఇండియా కూటమి ర్యాలీ
  • ర్యాలీలో పాల్గొన్న ఇండియా కూటమి ఎంపీలు
ఎలెక్షన్ కమిషన్ కు వ్యతిరేకంగా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇండియా కూటమి భారీ ర్యాలీ చేపట్టింది. పార్లమెంట్ నుంచి ఎలెక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో విపక్ష ఎంపీలు కేంద్రానికి, ఈసీకి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. కేంద్ర ప్రభుత్వం, ఈసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విపక్ష ఎంపీల ర్యాలీని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అనుమతి లేదంటూ బ్యారికేడ్లు అడ్డు పెట్టారు. దీంతో పోలీసులతో ఎంపీలు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్, పలువురు మహిళా ఎంపీలు బ్యారికేడ్లు దూకేందుకు యత్నించారు.

మరోవైపు, ఇటీవలి కాలంలో కాంగ్రెస్ తో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్న ఆ పార్టీ ఎంపీ శశిథరూర్ అనూహ్యంగా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. కొంత కాలంగా శశిథరూర్ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. సొంత పార్టీపై విమర్శలు గుప్పిస్తూ, బీజేపీ నేతలతో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారు. ఈ క్రమంలో ఇండియా కూటమి ర్యాలీలో ఆయన పాల్గొనడం ఆసక్తికరంగా మారింది.
Shashi Tharoor
India Alliance
Election Commission of India
Congress Party
Delhi Rally
Opposition MPs
Akhilesh Yadav
Indian Politics

More Telugu News