Suresh Gopi: కేంద్ర మంత్రి సురేశ్ గోపి కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు

Suresh Gopi Missing Complaint Filed in Thrissur
  • సురేశ్ గోపిపై త్రిస్సూర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ స్టూడెంట్స్ యూనియన్ లీడర్
  • మంత్రి, మేయర్ కూడా ఆయనను కలవలేకపోతున్నారన్న గోకుల్
  • బీజేపీ నేతలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్న గోకుల్
కేరళ బీజేపీ నేత, కేంద్ర మంత్రి, ప్రముఖ సినీ నటుడు సురేశ్ గోపి తమ నియోజకవర్గంలో ఎక్కడా కనిపించడం లేదని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు అందింది. కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ కేరళ స్టూడెంట్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు గోకుల్ గురువాయూర్ ఈ మేరకు త్రిస్సూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఛత్తీస్ గఢ్ లో మలయాళీ క్రైస్తవ సన్యాసినులు అరెస్ట్ అయినప్పటి నుంచి సురేశ్ గోపి కనిపించడం లేదని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. 

రెండు నెలల నుంచి సురేశ్ గోపి కనిపించడం లేదని... రెవెన్యూ మంత్రి, త్రిస్సూర్ మేయర్ కూడా ఆయనను కలవలేకపోతున్నారని గోకుల్ అన్నారు. సురేశ్ గోపి ఆచూకీ గురించి ఆయన కార్యాలయ సిబ్బందిని అడిగినా... ఆయన ఎక్కడున్నారో, ఎప్పుడు వస్తారో చెప్పడం లేదని తెలిపారు. అందుకే తాను పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వస్తోందని చెప్పారు. కేంద్ర మంత్రి కనిపించకపోవడంపై బీజేపీ నేతలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. 
Suresh Gopi
Suresh Gopi missing
Kerala BJP leader
Thrissur
Kerala Students Union
Gokul Guruvayoor
Chhattisgarh nuns arrest
Central Minister
BJP Kerala
Indian politics

More Telugu News