: ఏపీలో జిల్లాల మార్పుపై సర్కార్ కసరత్తు .. 26 నుంచి 32కి పెరిగే ఛాన్స్
- కొత్తగా ఆరు జిల్లాల ప్రతిపాదన
- కొత్తగా అమరావతి, గూడూరు, ఆదోని, పలాస, మదనపల్లి, మార్కాపురం జిల్లాలు
- కొన్ని జిల్లాల పేర్లు, సరిహద్దుల మార్పు
- త్వరలో మంత్రివర్గ ఉప సంఘం భేటీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు, జిల్లాల సరిహద్దులు, పేర్ల మార్పు, మండలాల మార్పులు, చేర్పులపై కసరత్తు చేస్తోంది. ఇందుకు గానూ ఇటీవల ఏడుగురు మంత్రులతో మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్, పి.నారాయణ, వంగలపూడి అనిత, బీసీ జనార్దన్‌రెడ్డిలు సభ్యులుగా ఉన్నారు.
తాజాగా ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో జిల్లాల పునర్విభజనకు సంబంధించిన అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించడం, నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని కేబినెట్ సబ్ కమిటీని ఆదేశించడంతో జిల్లాల సంఖ్య పెరుగుతుందని చర్చ జరుగుతోంది. కొత్త జిల్లాల ఏర్పాటులో గత ప్రభుత్వం కొన్ని తప్పులు చేసిందన్న అభిప్రాయం కూటమి నేతల్లో ఉంది.
జిల్లాల పునర్విభజనపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్న నేపథ్యంలో పలు జిల్లాలు, మండలాలకు సంబంధించిన డిమాండ్‌లు తెరపైకి వచ్చాయి. ప్రధానంగా ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంతాన్ని మార్కాపురం కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ గత ఐదేళ్లుగా వినిపిస్తోంది. ఈ మేరకు ఎన్నికల ప్రచారంలో కూడా చంద్రబాబు కొత్త జిల్లా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
యర్రగొండపాలెం, కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు, దర్శి నియోజకవర్గాలను కలిపి జిల్లా ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉంది. ఈ అంశం కూడా ప్రస్తుతం తెరపైకి వచ్చింది. అన్నమయ్య జిల్లాకు సంబంధించి రాయచోటి కాకుండా రాజంపేట ప్రధాన కేంద్రంగా ఉండాలనే డిమాండ్ వినిపిస్తోంది.
పశ్చిమ గోదావరి జిల్లాకు నర్సాపురాన్ని ప్రధాన కేంద్రంగా ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. కానీ భీమవరాన్ని పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన కేంద్రంగా ప్రకటించారు. ఇటు శ్రీసత్యసాయి జిల్లాకు సంబంధించి హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని ప్రజలు అడుగుతున్నారు. ప్రస్తుతం శ్రీసత్యసాయి జిల్లా ప్రధాన కేంద్రంగా పుట్టపర్తి ఉంది.
వీటన్నింటిపై మంత్రివర్గ ఉప సంఘం కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో జిల్లాల సంఖ్య 26 నుంచి 32కి పెరిగే అవకాశం ఉందని, కొన్ని జిల్లాల స్వరూపం మారనుందని తెలుస్తోంది. ప్రస్తుతం కృష్ణాజిల్లాలో ఉన్న పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాలను ఎన్టీఆర్ జిల్లాలోకి మార్చే అలోచనను ప్రభుత్వం చేస్తోందని అంటున్నారు. అద్దంకి, కందుకూరు నియోజకవర్గాలను మళ్లీ ప్రకాశం జిల్లాలోకి మార్పు చేయనున్నారు.
కొత్తగా అమరావతి, గూడూరు, ఆదోని, పలాస, మదనపల్లి, మార్కాపురం జిల్లాలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. జిల్లా కేంద్రాల దూరం తగ్గించడం, పాలనా సౌలభ్యంకు సంబంధించి ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రస్తుతం ఉన్న జిల్లాల నుంచి కొత్త జిల్లాలలోకి పలు నియోజకవర్గాలు మారనున్నాయని టాక్ నడుస్తోంది. త్వరలో మంత్రివర్గ ఉప సంఘం సమావేశమై తాజా పరిస్థితులు, కొత్త జిల్లాలు, సరిహద్దు మార్పులపై చర్చించనుంది.
అమరావతి కేంద్రంగా ఏర్పాటు అవుతున్న కొత్త జిల్లాలో పెదకూరపాడు, తాడికొండ, మంగళగిరి, నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాలను చేర్చనున్నారని సమాచారం. అలాగే పలాస జిల్లాలో ఇచ్చాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం, ఆదోని జిల్లాలో ఆదోని, పత్తికొండ, ఆలూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, మదనపల్లి జిల్లాలో మదనపల్లి, పీలేరు, పుంగనూరు, తంబళ్లపల్లి, మార్కాపురం జిల్లాలో మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, దర్శి నియోజకవర్గాలు ఉండనున్నాయి.
గూడూరు జిల్లాలో గూడురు, వెంకటగిరి, సర్వేపల్లి, సూళ్లూరుపేట అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండనున్నాయని సమాచారం. శ్రీసత్యసాయి జిల్లా కేంద్రాన్ని హిందూపురంకు మార్చి, సత్యసాయి హిందూపురం జిల్లాగా పేరు మార్చే అవకాశం ఉందని అంటున్నారు. రాయచోటి జిల్లా కేంద్రంగా ఉన్న అన్నమయ్య జిల్లాను అన్నమయ్య రాజంపేట జిల్లాగా మార్పు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.