Chandrababu Naidu: రాఖీ పండుగ రోజు ఆడబిడ్డలకు పట్టాల పంపిణీ ఎంతో సంతృప్తిని ఇచ్చింది: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Land deeds distribution on Rakhi satisfying
  • నెల్లూరు భగత్ సింగ్ కాలనీలో 633 మందికి పట్టాల పంపిణీ
  • వర్చువల్‌గా పాల్గొన్న సీఎం చంద్రబాబు
  • మంత్రి నారాయణ విన్నపం మేరకు పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఆన్ లైన్ లో హాజరు
2029 నాటికి ప్రతి ఒక్కరికీ సొంతింటి కలను నిజం చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల ఇంటి స్థలం ఇస్తామనే హామీని అమలుచేస్తామని స్పష్టం చేశారు. ఇదే సమయంలో పేదలు రెండు మూడు దశాబ్దాలుగా ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉంటే వాటిని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు. ఈ విషయం ఇప్పటికే ఎమ్మెల్యేలకు చెప్పామని... పలుచోట్ల వారు చొరవ తీసుకుని అర్హులకు పట్టాలు ఇప్పించడం అభినందనీయమని అన్నారు. నెల్లూరు భగత్ సింగ్ కాలనీలో 633 మందికి పట్టాల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు వర్చువల్‌గా పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి నారాయణ విన్నపం మేరకు పట్టాల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ:... "రాఖీ పండుగ రోజు ఆడబిడ్డలకు ఇళ్లపట్టాలు పంపిణీ చేయడం ఎంతో సంతృప్తిని ఇచ్చింది. ఈ రోజు భగత్ సింగ్ కాలనీలో పట్టాలు అందుకున్న 633 మందికి శుభాకాంక్షలు. ఎక్కడ ఏ అవకాశం ఉన్నా పేదలకు సాయం చేయడంలో కూటమి ప్రభుత్వం ముందుంటుంది. నెల్లూరులో చొరవ తీసుకుని అన్ని సాంకేతిక సమస్యలు పరిష్కరించి మహిళలకు పట్టాలిచ్చిన నారాయణకు అభినందనలు” అని అన్నారు. 

పేదలను ఆదుకునేందుకు సూపర్ సిక్స్ సహా అన్ని పథకాలు అమలు చేస్తున్నామని... సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయ్యాయని సీఎం అన్నారు. ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం ఇస్తున్నామని... ప్రభుత్వం ఇచ్చే పింఛన్లు, ఉచిత గ్యాస్, తల్లికి వందనం, అన్నదాత సుఖీవభ, అన్నా క్యాంటీన్లు వంటి సంక్షేమ కార్యక్రమాలతో పేదల జీవన ప్రమాణాలు పెంచుతున్నామని అన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యంతో ఆడబిడ్డలకు మరింత మేలు జరుగుతుందని తెలిపారు.  


Chandrababu Naidu
Andhra Pradesh
ఇంటి పట్టాలు
భగత్ సింగ్ కాలనీ
Nellore
భూమి హక్కులు
Super Six schemes
AP government schemes
Free bus travel
Rakhi Purnima

More Telugu News