Nara Lokesh: మా కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు రజనీకాంత్ గారు అండగా నిలిచారు: మంత్రి నారా లోకేశ్

Nara Lokesh recalls Rajinikanth support during family crisis
  • సినిమాల్లో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్
  • రజనీకాంత్‌పై ఏపీ మంత్రి నారా లోకేశ్ ప్రశంసలు
  • 'కూలీ' సినిమాకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్
  • రజనీకాంత్‌పై ప్రత్యేకంగా ఎడిట్ చేసిన వీడియో షేర్
సూపర్ స్టార్ రజనీకాంత్‌పై ఆంధ్రప్రదేశ్ ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రజనీకాంత్ సినీ ప్రస్థానంలో 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ, తమ కుటుంబానికి కష్టకాలంలో ఆయన అందించిన మద్దతును గుర్తుచేసుకున్నారు. ఈ మేరకు లోకేశ్ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు.

"రజనీకాంత్ శకంలో మనం జీవించడం అదృష్టం. ఆయన చిత్ర పరిశ్రమలో 50 ఏళ్లు పూర్తి చేసుకోవడం ఎంతో సంతోషాన్నిచ్చే విషయం" అని లోకేశ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇదే సమయంలో ఆయన తమ కుటుంబంతో రజనీకి ఉన్న అనుబంధాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. "మా కుటుంబం అత్యంత కష్ట కాలంలో ఉన్నప్పుడు రజనీకాంత్ గారు మాకు అందించిన అచంచలమైన మద్దతును ఎప్పటికీ మర్చిపోలేను" అని లోకేశ్ భావోద్వేగంగా తెలిపారు.

ఈ సందర్భంగా రజనీకాంత్ నటిస్తున్న 'కూలీ' చిత్ర బృందానికి విజయం చేకూరాలని ఆకాంక్షించారు.  అంతేకాదు, స్పెషల్ గా ఎడిట్ చేసిన రజనీకాంత్ పవర్ హౌస్ వీడియోను కూడా లోకేశ్ పంచుకున్నారు.
Nara Lokesh
Rajinikanth
AP Minister
Telugu Desam
Coolie Movie
Political Support
Family Support
Indian Cinema
Superstar Rajinikanth

More Telugu News