Dal Mill Suri: కోట్ల రూపాయల మోసాలు.. వైసీపీ నేతపై లుకౌట్ నోటీసులు

Dal Mill Suri YSRCP Leader Faces Lookout Notice in Fraud Case
  • వ్యాపారాల పేరుతో భారీ మోసాలకు పాల్పడిన సత్యసాయి జిల్లా వైసీపీ నేత సూరి
  • పీడీ యాక్ట్ నమోదు చేశామన్న జిల్లా ఎస్పీ రత్న
  • సూరిపై మొత్తం 36 కేసులు
శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువుకు చెందిన వైసీపీ నేత దాల్ మిల్ సూరిపై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. దీంతోపాటు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. వివిధ వ్యాపారాల పేరుతో చాలా మందిని కోట్లాది రూపాయల మేర మోసం చేసి, తప్పించుకుని తిరుగుతున్న ఆరోపణలతో పీడీ యాక్ట్ నమోదు చేశారు. జిల్లా ఎస్పీ రత్న మాట్లాడుతూ... పలు జిల్లాల్లో వివిధ వ్యాపారాల పేరుతో కోట్లాది రూపాయల మోసాలకు సూరి పాల్పడ్డాడని, ఆయనపై 36 కేసులు నమోదయ్యాయని తెలిపారు. 

కోట్లాది రూపాయల మోసాలకు పాల్పడడమే కాకుండా, ఆర్థిక నేరాలకు కూడా పాల్పడినట్టు విచారణలో తేలిందని వెల్లడించారు. జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు పీడీ యాక్ట్ నమోదు చేశామని తెలిపారు. సూరిపై కొత్తచెరువు పీఎస్ లో 20 కేసులు, నెల్లూరు రూరల్ పీఎస్ లో 16 కేసులు నమోదయ్యాయని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో సూరి బాధితులు ఎవరైనా ఉంటే తమకు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. సూరి ఆచూకీ తెలపాలంటూ తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో లుకౌట్ నోటీసులు జారీ చేస్తున్నామని చెప్పారు.  
Dal Mill Suri
YSRCP Leader
Andhra Pradesh Crime
Financial Fraud
Lookout Notice
PD Act
Sri Sathya Sai District
Kotla Rupayala Mosalu
AP Police
Economic Offences

More Telugu News