Benjamin Netanyahu: గాజా స్వాధీనంపై క్లారిటీ ఇచ్చిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు

Benjamin Netanyahu Clarifies Gaza Takeover Plan
  • గాజాను స్వాధీనం చేసుకునే ప్రతిపాదనకు ఇజ్రాయెల్ కేబినెట్ ఆమోదం
  • స్వదేశీ నేతలతో పాటు విదేశీ నేతల నుంచి విమర్శలు
  • గాజాను ఆక్రమించుకోం... హమాస్ నుంచి విముక్తి కల్పిస్తామన్న నెతన్యాహు
గాజాను పూర్తిగా స్వాధీనం చేసుకునే ప్రతిపాదనకు ఇజ్రాయెల్ కేబినెట్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై స్వదేశీ నేతలతో పాటు వివిధ దేశాల నేతల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో, తమ ప్రణాళిక గురించి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. 

ఎక్స్ వేదికగా నెతన్యాహు స్పందిస్తూ... "మేము గాజాను ఆక్రమించుకోవడం లేదు. హమాస్ నుంచి గాజాకు విముక్తి కల్పిస్తాం. గాజాలో సైనిక కార్యకలాపాలు జరగకుండా చేస్తాం. శాంతియుత పరిపాలన ఏర్పాటుకు మేము కట్టుబడి ఉన్నాం. పాలస్తీనా అథారిటీ కానీ, హమాస్ కానీ, ఏ ఇతర టెర్రరిస్ట్ సంస్థ కానీ ఆ ప్రాంతంలో ఉండదు. ఈ చర్య గాజాలో హమాస్ చెరలో బందీలుగా ఉన్న మా వారిని విడిపించుకోవడానికి ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో గాజా నుంచి ఇజ్రాయెల్ కు ఎలాంటి ముప్పు లేకుండా చేస్తుంది" అని పేర్కొన్నారు.
Benjamin Netanyahu
Gaza
Israel
Hamas
Palestine
Gaza Strip
Israel Palestine conflict
Netanyahu Gaza
Gaza takeover
Israel military

More Telugu News