వార్-2 ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే...!

  • జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో రూపొందిన మూవీ వార్ – 2
  • మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ  
  • ఆగస్టు 10న హైదరాబాద్ యూసిఫ్ గూడ పోలీస్ గ్రౌండ్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటూ ప్రకటన 
జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలయికలో వస్తున్న వార్ 2 మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై నెలకొన్న సందిగ్ధత వీడింది. అభిమానులకు మూవీ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ‘ఎక్స్’ వేదికగా శుభవార్తను తెలియజేసింది. ఇదివరకే విడుదలైన ట్రైలర్ వార్ 2 చిత్రంపై అంచనాలను పెంచేసింది. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ జరుగుతుందనే దానిపై పలు ఊహాగానాలు వినిపించాయి. విజయవాడలో నిర్వహిస్తారనే ప్రచారం కూడా జరిగింది.

అయితే, ఈ ఊహాగానాలకు తెర దించుతూ మూవీ నిర్మాణ సంస్థ ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై అధికారిక ప్రకటన చేసింది. యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో ఈ నెల 10వ తేదీన వేడుక నిర్వహించనున్నట్లు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ‘ఎక్స్’ వేదికగా ప్రకటించింది. ఆ రోజు సాయంత్రం 5 గంటలకు వేడుక ప్రారంభమవుతుందని తెలిపింది.

ఈ వేడుకకు ఎన్టీఆర్ హాజరవుతున్నారు. కానీ హృతిక్ రోషన్ హాజరవుతారా లేదా అనే విషయంపై ఇంతవరకు సమాచారం లేదు. యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందిన ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. కియారా అడ్వానీ కథానాయికగా నటించింది. ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. 


More Telugu News