Andhra Pradesh High Court: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నలుగురు అడిషనల్ జడ్జిలకు ప్రమోషన్

Andhra Pradesh High Court Four Additional Judges Promoted
  • జస్టిస్ హరినాథ్, జస్టిస్ కిరణ్మయి, జస్టిస్ సుమతి, జస్టిస్ విజయ్ లకు పదోన్నతి
  • వీరి నియామకానికి ఆమోదముద్ర వేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
  • ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర న్యాయశాఖ
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నలుగురు అదనపు న్యాయమూర్తులకు పదోన్నతి లభించింది. అదనపు న్యాయమూర్తులుగా విధులు నిర్వహిస్తున్న జస్టిస్ నూనెపల్లి హరినాథ్, జస్టిస్ మండవ కిరణ్మయి, జస్టిస్ జగడం సుమతి, జస్టిస్ న్యాపతి విజయ్‌లను శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్ర న్యాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ త్వరలో ఈ నలుగురితో శాశ్వత న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

కాగా, ఆంధ్రప్రదేశ్ సహా ఆరు రాష్ట్రాల్లోని 16 మంది హైకోర్టు అదనపు న్యాయమూర్తులకు పదోన్నతి కల్పించాలని ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. దీనికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలపడంతో కేంద్ర న్యాయశాఖ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్‌వాల్ 'ఎక్స్' వేదికగా వెల్లడిస్తూ, పదోన్నతి పొందిన న్యాయమూర్తులకు శుభాకాంక్షలు తెలియజేశారు. 
Andhra Pradesh High Court
Justice Harinath Nunepalli
Justice Kiranmayi Mandava
Justice Sumathi Jagadam
Justice Vijay Nyapathi
High Court Judges Promotion
Droupadi Murmu
Arjun Ram Meghwal
Supreme Court Collegium
AP High Court

More Telugu News