Turaka Kishore: వైసీపీ నేత తురకా కిశోర్ విడుదల

YSRCP Leader Turaka Kishore Released From Jail
  • అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్న తురకా కిశోర్ 
  • హైకోర్టు ఆదేశాలతో జైలు నుంచి బయటికి!
  • స్వాగతం పలికిన కుటుంబ సభ్యులు
టీడీపీ నేతలపై దాడి కేసు సహా, అనేక ఇతర కేసుల్లో నిందితుడిగా ఉన్న వైసీపీ నేత, మాచర్ల మున్సిపాలిటీ మాజీ చైర్మన్ తురకా కిశోర్ ఎట్టకేలకు విడుదలయ్యారు. తురకా కిశోర్ ను తక్షణమే విడుదల చేయాలన్న హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, శుక్రవారం సాయంత్రం తురకా కిశోర్ గుంటూరు జిల్లా జైలు నుంచి బయటికి వచ్చారు. ఆయనకు కుటుంబ సభ్యులు స్వాగతం పలికారు. 

తురకా కిశోర్ మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ప్రధాన అనుచరుడిగా గుర్తింపు పొందారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో బుద్ధా వెంకన్న, బొండా ఉమ ప్రయాణిస్తున్న వాహనంపై తురకా కిశోర్ దాడి చేసిన వీడియోలు సంచలనం సృష్టించాయి. తురకా కిశోర్ పై 11 హత్యాయత్నం కేసులు, ఒక పీడీ యాక్ట్ కేసు ఉన్నట్టు తెలుస్తోంది. 
Turaka Kishore
YSRCP
Macharla
Guntur
Andhra Pradesh Politics
Pinelli Ramakrishna Reddy
TDP Leaders Attack Case
Buddha Venkanna
Bonda Uma
High Court

More Telugu News