YS Avinash Reddy: వైఎస్ అవినాశ్ రెడ్డిని బలిపశువు చేయాలనుకుంటున్నారు: మేరుగు నాగార్జున
- చంద్రబాబు ఆటలో సునీత కీలుబొమ్మగా మారారన్న మేరుగు
- తండ్రిని ఓడించిన వారికి ఎలా మద్దతు ఇస్తున్నారో చెప్పాలన్న మేరుగు
- చంద్రబాబువి తప్పుడు రాజకీయాలని విమర్శ
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీతపై వైసీపీ నేత, మాజీ మంత్రి మేరుగు నాగార్జున తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ ఆటలో సునీత కీలుబొమ్మగా మారారని అన్నారు. కడప జిల్లాలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా సునీతతో, ఆమె భర్తతో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. కడప ఎంపీ అవినాశ్ రెడ్డిని రాజకీయంగా బలిపశువు చేయాలనుకుంటున్నారని దుయ్యబట్టారు. తన తండ్రి వివేకాను ఓడించిన వారికి ఎలా మద్దతు ఇస్తున్నారో సునీత చెప్పాలన్నారు.
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో ఒక వైపు అరాచకాలు చేస్తూనే... మరోవైపు మరోసారి వివేకా హత్య కేసును తెరపైకి తెచ్చారని అన్నారు. చంద్రబాబు ఎప్పుడూ తప్పుడు పద్ధతులతోనే రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబును ప్రజలు అసహ్యించుకుంటున్నారని... అందుకే సునీతను రంగంలోకి దించారని చెప్పారు. గత రెండు ఎన్నికల్లో వివేకా హత్య కేసును వాడుకుని లబ్ధి పొందాలని ప్రయత్నించారని మండిపడ్డారు.