పులివెందులలో టీడీపీ గెలిచే పరిస్థితి ఉంటే ఈ దాడులు ఎందుకు?: లేళ్ల అప్పిరెడ్డి
- టీడీపీ గెలుపుకోసం పోలీసు, రెవెన్యూ యంత్రాంగం పనిచేస్తోందన్న లేళ్ల
- ఈ ఉప ఎన్నికతో రాష్ట్ర రాజకీయాలు తారుమారు అవుతాయా అని ప్రశ్న
- ఎన్నికలు వచ్చినప్పుడే సునీత బయటకు వస్తారని విమర్శ
పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం పోలీసు, రెవెన్యూ యంత్రాంగం నిస్సిగ్గుగా పనిచేస్తోందని వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. పోలీసులు పచ్చ చొక్కాలు వేసుకుని వైసీపీ నేతలను ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి ఓటు వేయడానికి రాకుండా చేసి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని అన్నారు. దేశంలో ఎక్కడైనా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా? అని ప్రశ్నించారు. రెండు దశాబ్దాల క్రితం బీహార్ లో ఉన్న పరిస్థితిని టీడీపీ ప్రభుత్వం ఏపీలో తీసుకొచ్చిందని అన్నారు.
పులివెందుల ఉప ఎన్నికతోనే రాష్ట్ర రాజకీయాలు తారుమారు అవుతాయా? అని లేళ్ల ప్రశ్నించారు. ఆరు పోలింగ్ కేంద్రాలను మార్చేశారని... ప్రజలు ఓటు వేయాలనుకుంటున్నారా? వద్దనుకుంటున్నారా? అని అడిగారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహిస్తే ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారనేది తెలుస్తుందని అన్నారు. ఉప ఎన్నికలో టీడీపీ గెలిచే పరిస్థితి ఉంటే ఈ దాడులు ఎందుకని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినప్పుడే సునీత (వివేకా కుమార్తె) బయటకు వస్తారని అన్నారు.