రాష్ట్రానికి ఉపయోగపడే ఒక్క పనైనా చేయండి... బండి సంజయ్ కి జగ్గారెడ్డి కౌంటర్

  • ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలన్న బండి సంజయ్
  • కేసీఆర్ కుటుంబంలో ఒక్క అరెస్ట్ కూడా జరగలేదని వ్యాఖ్య
  • అరెస్టులు చేయడం తమ ఉద్దేశం కాదన్న జగ్గారెడ్డి
ఫోన్ ట్యాపింగ్ కేసుపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సీబీఐ చేత విచారణ జరిపించాలని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితుడేనని... అయినా ఈ కేసులో ఇంత వరకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదని విమర్శించారు. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు. 

జరిగిన అవినీతిని, తప్పులను బయటపెట్టడం తప్ప అరెస్టులు చేయడం తమ ఉద్దేశం కాదని జగ్గారెడ్డి అన్నారు. ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఇంకెంత కాలం వెళ్లదీస్తారని ప్రశ్నించారు. కేంద్ర మంత్రిగా పని చేసే అవకాశం వచ్చిందని... రాష్ట్రానికి ఉపయోగపడే ఒక్క పనైనా చేయాలని హితవు పలికారు. ఎవరితో ఎవరికి చీకటి ఒప్పందాలు ఉన్నాయో తెలంగాణ సమాజానికి తెలుసని అన్నారు.


More Telugu News