జాతీయ విద్యా విధానానికి స్వస్తి... ద్విభాషా విధానాన్ని ప్రకటించిన స్టాలిన్

  • రాష్ట్ర విద్యా విధానాన్ని ఆవిష్కరించిన స్టాలిన్
  • ఇది జాతీయ విద్యా విధానానికి నిర్ణయాత్మక విరామంలాంటిదన్న సీఎం
  • సైన్స్, ఏఐ, ఇంగ్లీష్ లకు పెద్దపీట
జాతీయ విద్యా విధానానికి తమిళనాడు సీఎం స్టాలిన్ స్వస్తి పలికారు. జాతీయ విద్యా విధానంలోని త్రిభాషా విధానానికి పూర్తిగా వ్యతిరేకమని చెప్పారు. ద్విభాషా విద్యా విధానాన్ని స్టాలిన్ ప్రకటించారు. ఈ మేరకు తమిళనాడు రాష్ట్ర విద్యా విధానాన్ని స్టాలిన్ ఆవిష్కరించారు. ఈ విధానం కేంద్ర జాతీయ విద్యా విధానానికి నిర్ణయాత్మక విరామంలాంటిదని సీఎం పేర్కొన్నారు. రాష్ట్ర విద్యా విధానంలో సైన్స్, ఏఐ, ఇంగ్లీష్ లకు పెద్దపీట వేశారు. 11, 12 తరగతుల మార్కుల ఆధారంగా యూజీ అడ్మిషన్లు ఉంటాయని తెలిపారు.

తమిళనాడు విద్యా శాఖ మంత్రి అన్బుల్ మహేశ్ మాట్లాడుతూ... 10వ తరగతి వరకు రాష్ట్ర బోర్డు, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ సహా అన్ని బోర్డులలో విద్యార్థులు తమిళం చదువుతారని చెప్పారు. 

మరోవైపు మాజీ గవర్నర్, బీజేపీ నాయకురాలు తమిళిసై సౌందరరాజన్ తమిళనాడు విద్యా విధానాన్ని తప్పుబట్టారు. ఇది రాష్ట్ర అహంకార విధానమని చెప్పారు. స్టాలిన్ ప్రభుత్వం విద్యను కుదించాలని కోరుకుంటోందని అన్నారు.


More Telugu News