Hussain Sagar Lake: నిండుకుండలా హుస్సేన్ సాగర్

Hussain Sagar Lake overflows due to heavy Hyderabad rains
  • నిన్న రాత్రి హైదరాబాద్ లో భారీ వర్షం
  • హుస్సేన్ సాగర్ కు భారీగా వరద 
  • పూర్తి స్థాయికి చేరిన నీటిమట్టం
నిన్న రాత్రి హైదరాబాద్ లో భారీ వర్షం కురిసిన సంగతి తెలిసిందే. దీంతో నగరం మొత్తం వర్షపు నీరు పోటెత్తింది. ఈ క్రమంలో కూకట్ పల్లి, బేగంపేట్, ఖైరతాబాద్ వైపు నుంచి హుసేన్ సాగర్ కు భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో, హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. 

హుస్సేన్ సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 514 మీటర్లు కాగా... ఈ మధ్యాహ్నం నీటిమట్టం 513.63 మీటర్లకు చేరుకుంది. ప్రస్తుతం సాగర్ కు 1,234 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా... ఔట్ ఫ్లో 1,523 క్యూసెక్కులుగా ఉంది. నీటిని దిగువకు వదులుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
Hussain Sagar Lake
Hyderabad rains
Heavy rainfall
Telangana floods
Kukatpally
Begumpet
Khairatabad
Lake overflowing
Flood alert

More Telugu News