Benjamin Netanyahu: గాజాను ఇజ్రాయెల్ ఆక్రమిస్తుందా? ఏం జరగబోతోంది?
- యుద్ధం చేస్తున్నా బందీలను విడిపించుకోలేకపోతున్న ఇజ్రాయెల్
- హమాస్ సైనిక శక్తి క్షీణిస్తున్నా పట్టువదలని వైనం
- ఇజ్రాయెల్ ముందు మూడు ప్రత్యామ్నాయాలు
గాజాలో తన శత్రువులను ఇజ్రాయెల్ ఓడించినా బందీలను మాత్రం ఇంకా తిరిగి తీసుకురాలేకపోయింది. హమాస్ సైనిక శక్తి క్షీణించినట్టు కనిపించినా, దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. గాజా పూర్తిగా ధ్వంసమైంది. కరవు పరిస్థితులకు చేరుకుంటోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ యుద్ధం ఎలా ముగుస్తుందనే దానిపై మూడు కీలక అంశాలు చర్చలో ఉన్నాయి.
గాజాను పూర్తిగా ఆక్రమించడం
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గాజాను తిరిగి ఆక్రమించేందుకు ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉందని ఇజ్రాయెల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఒకవేళ ఇది నిజమైతే, గాజాలోని 20 లక్షల మంది నివసిస్తున్న ప్రాంతాల్లోకి సైన్యం ప్రవేశించాల్సి ఉంటుంది. ఇది మరింత ప్రాణనష్టానికి దారితీస్తుంది. ఇది ఇజ్రాయెల్ను అంతర్జాతీయంగా మరింత ఏకాకిని చేస్తుంది. అయితే, నెతన్యాహు ప్రభుత్వంలోని తీవ్రవాద మిత్రపక్షాలు దీనికి మద్దతు తెలుపుతున్నాయి.
అంతర్జాతీయ డిమాండ్లకు అనుగుణంగా కాల్పుల విరమణ
అమెరికా, ఐక్యరాజ్యసమితి డిమాండ్ల ప్రకారం శాశ్వత కాల్పుల విరమణ, గాజా నుంచి ఇజ్రాయెల్ సైన్యం ఉపసంహరణ, ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న పాలస్తీనియన్ల విడుదలకు బదులుగా మిగిలిన బందీలను హమాస్ విడుదల చేయాలి. అయితే, ఇజ్రాయెల్ దీనికి అంగీకరించడం లేదు. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో హమాస్ తిరిగి బలం పుంజుకుని మరోసారి దాడులు చేసే అవకాశం ఉందని భయపడుతోంది. నెతన్యాహు ఈ ప్రతిపాదనలకు ఒప్పుకుంటే ఆయన ప్రభుత్వం కూలిపోయే అవకాశం కూడా ఉంది.
ఇజ్రాయెల్ షరతులకు అనుగుణంగా కాల్పుల విరమణ
బందీలను తిరిగి అప్పగించి, హమాస్ లొంగిపోయి, నిరాయుధులైతే యుద్ధం ముగిస్తుందని నెతన్యాహు అంటున్నారు. గాజా ప్రజలను "స్వచ్ఛంద వలస" పేరిట ఇతర దేశాలకు తరలించాలనే ప్రణాళికను కూడా ఇజ్రాయెల్ ముందుకు తీసుకొచ్చింది. దీన్ని పాలస్తీనియన్లు, అంతర్జాతీయ సమాజం బలవంతపు బహిష్కరణగా చూస్తోంది. హమాస్ తమ అధికారాలను ఇతర పాలస్తీనియన్లకు అప్పగించడానికి సిద్ధంగా ఉన్నా, ఇజ్రాయెల్ ఆక్రమిత భూముల్లో శాంతి నెలకొనే వరకు ఆయుధాలు వదలబోమని చెబుతోంది.
యుద్ధం కొనసాగితే..
ఈ పై మూడు విషయాలు సాధ్యం కాకపోతే ప్రస్తుత స్థితిలో యుద్ధం నిరవధికంగా కొనసాగే అవకాశం ఉంది. రోజువారీ ఇజ్రాయెల్ వైమానిక దాడులు, హమాస్ గెరిల్లా దాడులు కొనసాగుతాయి. బందీలు నెలలు లేదా సంవత్సరాల పాటు బందీలుగానే ఉండే ప్రమాదం ఉంది. ఈ యుద్ధం భవిష్యత్తు చాలా వరకు అమెరికా, ఇజ్రాయెల్ నాయకుల నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది.