Vladimir Putin: డోంట్ కేర్ ట్రంప్... భారత పర్యటనకు వస్తున్న పుతిన్!

Vladimir Putin to Visit India Amid Trumps Trade Concerns
  • రష్యా నుంచి ఆయిల్ కొంటున్నారంటూ భారత్ పై ట్రంప్ సుంకాలు
  • ట్రంప్ ను పట్టించుకోని భారత్, రష్యా
  • ఈ నెలాఖరున భారత్ లో పర్యటించనున్న పుతిన్!
రష్యా నుంచి ముడిచమురు కొంటున్నారనే కారణంతో భారత్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 50 శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. ఏదో ఒక విధంగా భారత్ ను రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయకుండా చూడాలనే యోచనలో ట్రంప్ ఉన్నారు. అయితే, ఇవేవీ భారత్-రష్యా స్నేహ బంధంపై ప్రభావం చూపలేకపోయాయి. రష్యా అధినేత ట్రంప్ త్వరలోనే భారత పర్యటనకు రానున్నారు. ఈ విషయాన్ని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ వెల్లడించారు. ప్రస్తుతం దోవల్ మాస్కోలో ఉన్నారు.

పుతిన్ భారత పర్యటన తేదీలు ఖరారు కానప్పటికీ... ఈ నెలాఖరు ఆయన భారత పర్యటన ఉండొచ్చని 'ఇంటర్ ఫ్యాక్స్ న్యూస్ ఏజెన్సీ' తెలిపింది. భారత్ పై మరో 25 శాతం సుంకాలు పెంచుతూ నిన్ననే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై ట్రంప్ సంతకం చేశారు. ఇది జరిగిన ఒక్క రోజు వ్యవధిలోనే భారత పర్యటకు పుతిన్ వస్తున్నారనే వార్త అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.
Vladimir Putin
India Russia relations
Donald Trump
Crude oil imports India
Ajit Doval
Russia India trade
US India trade relations
Moscow
International relations

More Telugu News