బ్యాంక్ ఆఫ్ బరోడాలో మేనేజర్ స్థాయి ఉద్యోగాలకు నోటిఫికేషన్

  •  417 మేనేజర్ స్థాయి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
  • రూ.64,820 నుండి రూ.93,960 వరకు వేతనాలు
  • ఆగస్టు 6 నుంచి 26 వరకు దరఖాస్తులకు అవకాశం
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగ అవకాశాలను అందిస్తూ బ్యాంక్ ఆఫ్ బరోడా 2025 సంవత్సరానికి సంబంధించి 417 మేనేజర్ స్థాయి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో సేల్స్ మేనేజర్, అగ్రికల్చర్ సేల్స్ ఆఫీసర్, అగ్రికల్చర్ సేల్స్ మేనేజర్ వంటి పోస్టులు ఉన్నాయి.

జీత భత్యాలు

ఈ పోస్టులకు అనుభవం ఆధారంగా నెలవారీ జీతం రూ.64,820 నుండి రూ.93,960 వరకు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు

జనరల్, EWS, OBC అభ్యర్థులకు: రూ.850

SC, ST, PwD, ESM/DESM మరియు మహిళా అభ్యర్థులకు: రూ.175

దరఖాస్తు ప్రక్రియ

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 6న ప్రారంభమైంది. ఆగస్టు 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన మరియు ఆసక్తిగల అభ్యర్థులు బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక వెబ్‌సైట్ www.bankofbaroda.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

అర్హతలు

మేనేజర్ – సేల్స్: ఏదైనా డిసిప్లిన్‌లో గ్రాడ్యుయేషన్ (ప్రాధాన్యంగా MBA/PGDM మార్కెటింగ్/సేల్స్/బ్యాంకింగ్‌లో). కనీసం 3 సంవత్సరాల సేల్స్ అనుభవం (బ్యాంకింగ్ మరియు ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో).

అగ్రికల్చర్ మార్కెటింగ్ ఆఫీసర్: అగ్రికల్చర్/హార్టికల్చర్/బయోటెక్నాలజీ/ఫుడ్ టెక్నాలజీ వంటి సంబంధిత రంగాలలో 4 సంవత్సరాల డిగ్రీ. కనీసం 1 సంవత్సరం అగ్రి సేల్స్ అనుభవం.

మేనేజర్ – అగ్రి సేల్స్: కనీసం 3 సంవత్సరాల అగ్రి సేల్స్ అనుభవం.


ఎలా దరఖాస్తు చేయాలి?

బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక వెబ్‌సైట్‌లోని ‘కెరీర్స్’ విభాగంలో ‘కరెంట్ ఆపర్చునిటీస్’ లింక్‌ను క్లిక్ చేయండి.

‘ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారమ్’పై క్లిక్ చేసి, రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయండి.

వ్యక్తిగత, విద్యా వివరాలను నమోదు చేసి, అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి.

దరఖాస్తు ఫీజును డెబిట్/క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా UPI ద్వారా చెల్లించండి.

అప్లికేషన్ ఫారమ్‌ను సమర్పించి, ఫైనల్ ఫారమ్ మరియు ఈ-రిసిప్ట్‌ను ప్రింట్ చేయండి.

మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.



More Telugu News