Tamannaah: దక్షిణాదికి చెందిన ఒక పెద్ద హీరో నాకు సారీ చెప్పాడు: తమన్నా

Tamannaah Shares Experience with South Indian Stars Apology
  • తాను చిన్న వయసులోనే ఇండస్ట్రీకి వచ్చానన్న తమన్నా
  • ఒక స్టార్ హీరోతో నటించేటప్పుడు అసౌకర్యంగా అనిపించిందని వెల్లడి
  • హీరోయిన్ ను తీసేయండి అని ఆయన గట్టిగా అరిచారన్న తమన్నా
మిల్కీ బ్యూటీ తమన్నా ఓవైపు సినిమాలు, మరోవైపు వెబ్ సిరీస్ లతో దూసుకుపోతోంది. తాజాగా ఓ ఇంటర్య్వూలో తమన్నా మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించింది. చిన్న వయసులోనే తాను ఇండస్ట్రీకి వచ్చానని... కెరీర్ తొలినాళ్లలో తాను ఎన్నో ఇబ్బందులు పడ్డానని చెప్పారు. 

చిన్న వయసులో ఇండస్ట్రీకి రావడం వల్ల తనకు ఏమీ తెలియదని అనుకునేవారని... తన విశ్వాసాన్ని దెబ్బతీయాలని చూసేవారని తెలిపింది. తనను అవమానించేందుకు కూడా యత్నించారని చెప్పింది. 

ఇండస్ట్రీకి వచ్చిన కొద్ది కాలంలోనే దక్షిణాదికి చెందిన ఒక పెద్ద స్టార్ తో నటించే అవకాశం వచ్చిందని... ఆయనతో నటించేటప్పుడు కొన్ని సన్నివేశాల్లో అసౌకర్యంగా అనిపించిందని తెలిపింది. ఇదే విషయాన్ని దర్శకనిర్మాతలకు చెప్పానని... అప్పుడు ఆ హీరో 'హీరోయిన్ ను తీసేయండి' అంటూ సెట్ లో గట్టిగా కేకలు వేశాడని చెప్పింది. అయితే, ఆ మరుసటి రోజు తనంతట తానే తన వద్దకు వచ్చి క్షమాపణలు చెప్పాడని వెల్లడించింది. తనకు కోపం వచ్చిందని... అందుకే అరిచానని చెప్పాడని తెలిపింది. తనతో అలా ప్రవర్తించినందుకు పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేశాడని చెప్పింది.
Tamannaah
Tamannaah Bhatia
South Indian actor
Telugu cinema
Movie industry
Apology
Film set incident
Tollywood
Web series
Heroine

More Telugu News