Viral Video: నీ యాస తేడాగా ఉంది.. నువ్వు తెలుగేనా?: అల్లు అర్హ ప్రశ్నకు మంచు లక్ష్మి అవాక్కు

Allu Arha Teased Manchu Lakshmi On Telugu Accent Video Goes Viral
  • మంచు లక్ష్మిని 'నువ్వు తెలుగేనా' అంటూ ఆట‌ప‌ట్టించిన‌ చిన్నారి
  • అర్హ మాటలకు నవ్వుతూ బదులిచ్చిన లక్ష్మి
  • సోషల్ మీడియాలో వైరల్ అయిన తమాషా వీడియో
  • అర్హ క్యూట్‌నెస్‌కు మురిసిపోతున్న బన్నీ ఫ్యాన్స్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారాలపట్టి అల్లు అర్హ మరోసారి తన ముద్దు ముద్దు మాటలతో నెట్టింట సందడి చేస్తోంది. తన వయసుకు మించిన తెలివితేటలతో ఎప్పుడూ ఆకట్టుకునే అర్హ, తాజాగా నటి మంచు లక్ష్మిని అడిగిన ఓ ప్రశ్న సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అర్హ అమాయకత్వానికి, తెలివికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

ఇటీవల అల్లు అర్జున్ ఇంటికి మంచు లక్ష్మి వెళ్లారు. ఆ సమయంలో అక్కడ ఉన్న అర్హతో సరదాగా ముచ్చటిస్తూ, "నన్ను ఏదో అడగాలనుకుంటున్నావంట కదా, ఏంటది?" అని లక్ష్మి అడిగారు. దీనికి అర్హ ఏమాత్రం తడుముకోకుండా, "నువ్వు తెలుగేనా? తెలుగు అమ్మాయివేనా?" అని సూటిగా ప్రశ్నించింది. అర్హ ప్రశ్నతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయిన లక్ష్మి, నవ్వుతూ "నేను తెలుగే పాపా, నీకెందుకు ఆ డౌట్ వచ్చింది?" అని అడిగారు.

దానికి అర్హ బదులిస్తూ, "నీ తెలుగు యాస అలా ఉంది" అని చెప్పడంతో లక్ష్మి మరింత ఆశ్చర్యానికి లోనయ్యారు. అర్హ సమాధానానికి మురిసిపోయిన ఆమె, "నీ యాస కూడా అలానే ఉంది కదా" అంటూ నవ్వుతూ బదులిచ్చారు. వీరిద్దరి మధ్య జరిగిన ఈ సరదా సంభాషణ తాలూకు వీడియో ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతోంది. వీడియో చూసిన బన్నీ ఫ్యాన్స్ అర్హ క్యూట్‌నెస్‌కు మురిసిపోతున్నారు.  

ఇక‌, అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి, అర్హకు సంబంధించిన వీడియోలను తరచూ సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు. అవి ఎప్పటికప్పుడు వైరల్ అవుతూ బన్నీ అభిమానులను, నెటిజన్లను ఎంతగానో అలరిస్తుంటాయి. ఈ క్రమంలోనే తాజా వీడియో కూడా అందరినీ ఆకట్టుకుంటోంది.
Viral Video
Allu Arha
Manchu Lakshmi
Allu Arjun
Sneha Reddy
Telugu language
Telugu accent
Social media
Kids questions
Celebrity interaction

More Telugu News