Telangana Rains: తెలంగాణ‌లో నేటి నుంచి మూడు రోజులు వ‌ర్షాలు

Rain Alert for Telangana Three Days of Showers
  • 3 రోజులు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల‌తో కూడిన తేలిక‌పాటి నుంచి మోస్త‌రు వ‌ర్షాలు
  • ఈ మేర‌కు హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం వెల్ల‌డి
  • ఈ రోజు రంగారెడ్డి, యాదాద్రి భువ‌న‌గిరి, వ‌న‌ప‌ర్తి, గ‌ద్వాల జిల్లాల్లో వాన‌లు
  • రేపు నాగ‌ర్‌క‌ర్నూల్‌, మ‌హబూబ్‌న‌గ‌ర్‌, వికార‌బాద్‌, నారాయ‌ణ‌పేట‌, జ‌న‌గామ జిల్లాల్లో వ‌ర్షాలు
  • ఎల్లుండి నాగ‌ర్‌క‌ర్నూల్‌, నిజామాబాద్‌, నిర్మ‌ల్‌, కుమురం భీమ్ జిల్లాల్లో వ‌ర్షాలు 
తెలంగాణ‌లో ఇవాళ్టి నుంచి మూడు రోజులు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల‌తో కూడిన తేలిక‌పాటి నుంచి మోస్త‌రు వ‌ర్షాలు కురిసే అవకాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం బుధ‌వారం తెలిపింది. ఈ రోజు రంగారెడ్డి, యాదాద్రి భువ‌న‌గిరి, వ‌న‌ప‌ర్తి, జోగులాంబ గ‌ద్వాల‌, నాగ‌ర్‌క‌ర్నూల్‌, మ‌హబూబ్‌న‌గ‌ర్‌.. రేపు నాగ‌ర్‌క‌ర్నూల్‌, మ‌హబూబ్‌న‌గ‌ర్‌, వికార‌బాద్‌, నారాయ‌ణ‌పేట‌, జ‌న‌గామ‌, సిద్దిపేట‌, యాదాద్రి భువ‌న‌గిరి, జోగులాంబ గ‌ద్వాల జిల్లాల్లో వానలు ప‌డ‌తాయ‌ని వెల్ల‌డించింది. అలాగే ఎల్లుండి నాగ‌ర్‌క‌ర్నూల్‌, నిజామాబాద్‌, నిర్మ‌ల్‌, కుమురం భీమ్ జిల్లాల్లో వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ కేంద్రం తెలిపింది. 
Telangana Rains
Telangana weather
Hyderabad weather
Rain alert
IMD Hyderabad
Weather forecast Telangana
Rangareddy
Nagar Kurnool
Mahbubnagar
Yadadri Bhuvanagiri

More Telugu News