అపాయింట్‌మెంట్ ఇవ్వొద్దని రాష్ట్రపతిపై మోదీ ఒత్తిడి తెచ్చారనేది మా అనుమానం: రేవంత్ రెడ్డి
- తెలంగాణ అసెంబ్లీ పంపిన బిల్లులు రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉన్నాయన్న రేవంత్
- రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ దొరకలేదని విమర్శ
- బీసీ రిజర్వేషన్లను ఆమోదించేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని వ్యాఖ్య
తెలంగాణ అసెంబ్లీ పంపిన బిల్లులు రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉన్నాయని రేవంత్ అన్నారు. రాష్ట్రపతిని కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు ఆమె అపాయింట్‌మెంట్ కోరామని... అయితే, రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ దొరకలేదని చెప్పారు. తమకు అపాయింట్‌మెంట్ ఇవ్వొద్దని రాష్ట్రపతిపై ప్రధాని మోదీ ఒత్తిడి తెచ్చారనేది తమ అనుమానమని అన్నారు. బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదించేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. రిజర్వేషన్ బిల్లుకు మోదీ మద్దతు ఇవ్వకపోతే... మోదీని గద్దె దించి, రాహుల్ ను ప్రధాని చేసుకుని... బీసీ రిజర్వేషన్లను సాధించుకుంటామని అన్నారు.