Airport Security: దేశంలోని అన్ని ఎయిర్ పోర్టులకు ఉగ్రముప్పు.. ఇంటెలిజెన్స్ హెచ్చరిక

Terror Threat Alert Issued for All Airports in India
  • సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 మధ్య దాడులు జరిగే అవకాశం ఉందన్న నిఘా వర్గాలు
  • ఎయిర్ పోర్టుల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని పౌర విమానయాన భద్రతా బ్యూరో ఆదేశం
  • విమానాశ్రయాల వద్ద అలర్ట్ అయిన భద్రతా సిబ్బంది
దేశంలోని అన్ని విమానాశ్రయాల భద్రతకు ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఉగ్రవాద, సంఘ వ్యతిరేక శక్తులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో, అన్ని ఎయిర్ పోర్టుల్లో హైఅలర్ట్ ప్రకటించారు. 

ఈ ఏడాది సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 మధ్య విమానాశ్రయాలపై దాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ క్రమంలో, కేంద్ర పౌర విమానయాన భద్రతా బ్యూరో అన్ని ఎయిర్ పోర్టులకు అడ్వైజరీ జారీ చేసింది. ఎయిర్ పోర్టుల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆదేశించింది. రన్ వేలు, హెలీప్యాడ్స్, ఫ్లయింగ్ స్కూల్స్, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లలో భద్రత పెంచాలని సూచించింది.

ఈ క్రమంలో, విమానాశ్రయాల వద్ద భద్రతా సిబ్బంది అలర్ట్ అయింది. టెర్మినల్స్, పార్కింగ్ ఏరియా, పెరీమీటర్ జోన్ తదితర సున్నితమైన ప్రాంతాల్లో పెట్రోలింగ్ ను పెంచారు. స్థానిక పోలీసుల సహకారంతో ఎయిర్ పోర్టులకు వెళ్లే మార్గాల్లో తనిఖీలు చేపట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు. విమానాశ్రయ సిబ్బంది, కాంట్రాక్టర్లు, విజిటర్స్ ను కూడా తనిఖీలు చేయాలని నిర్ణయించారు.

ఇదే సమయంలో ప్రయాణికులకు కూడా అధికారులు పలు సూచనలు చేశారు. అనుమానాస్పదంగా ఎవరైనా వ్యక్తులు కానీ, వస్తువులు కానీ కనిపిస్తే వెంటనే సిబ్బంది దృష్టికి తీసుకువెళ్లాలని ప్రయాణికులకు సూచించారు.
Airport Security
India Airports
Terror Threat
Intelligence Alert
Aviation Security
High Alert
September 22
October 2
Runways
Helipads

More Telugu News