Madhavaram Krishna Rao: కాళేశ్వరంపై నివేదిక తప్పులతడక: మాధవరం కృష్ణారావు

Madhavaram Krishna Rao Slams Kaleshwaram Project Report
  • కాళేశ్వరంపై విచారణ కమిటీ నివేదికపై మాధవరం విమర్శలు
  • కేసీఆర్, హరీశ్ లను అప్రదిష్టపాలు చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని మండిపాటు
  • రెండు పిల్లర్లు కుంగిపోతే కాంగ్రెస్ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని విమర్శ
కాళేశ్వరం ప్రాజెక్ట్ పై విచారణ కమిటీ ఇచ్చిన నివేదికపై బీఆర్ఎస్ కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు విమర్శలు గుప్పించారు. ఆ నివేదిక తప్పులతడక అని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు, బీఆర్ఎస్ పార్టీలను అప్రదిష్టపాలు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని మండిపడ్డారు. 

కేంద్ర ప్రభుత్వ అనుమతులతోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ ను నిర్మించారని, కేవలం రెండు పిల్లర్లు కుంగిపోతే కాంగ్రెస్ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని కృష్ణారావు విమర్శించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ లో ఇంజినీర్లు, కార్మికులు మృతి చెందిన ఘటనకు కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరంలో కుంగిన పిల్లర్లకు వెంటనే మరమ్మతులు చేసి అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.
Madhavaram Krishna Rao
Kaleshwaram Project
KCR
Harish Rao
BRS Party
Telangana Congress
SLBC Tunnel
Telangana News
Irrigation Project
Corruption Allegations

More Telugu News