Zelensky: జెలెన్ స్కీ భార్య ప్రయాణిస్తున్న విమానం ఇండియాలో ల్యాండింగ్

Ukraine Presidents Wifes Flight Lands in Jaipur
  • ఉక్రెయిన్ నుంచి జపాన్ బయల్దేరిన ఒలెనా 
  • మార్గమధ్యంలో జైపూర్ లో ల్యాండ్ అయిన విమానం
  • ఇంధనం నింపుకున్న తర్వాత టోక్యోకు టేకాఫ్ అయిన విమానం
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ భార్య ఒలెనా జెలెన్ స్కీ ప్రయాణిస్తున్న విమానం భారత్ లో ఉన్నట్టుండి ల్యాండ్ అయింది. ఆదివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగు చేసింది. వివరాల్లోకి వెళితే, ఆమె జపాన్ రాజధాని టోక్యోకు వెళుతుండగా మార్గమధ్యంలో జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అయింది. ఇంధనం నింపుకోవడానికి వారి విమానం దిగినట్టు విదేశీ మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. 

ప్రొటోకాల్ ప్రకారం వారికి ఎలాంటి ఇమిగ్రేషన్ తనిఖీలు నిర్వహించలేదని అధికారులు తెలిపారు. ఇంధనం నింపుకునే సమయంలో వారు వీఐపీ లాంజ్ లో ఉన్నారని చెప్పారు. వారికి పౌర విమానయాన భద్రతా సంస్థ సెక్యూరిటీ కల్పించింది. ఇదే సమయంలో భారత్ లోని ఉక్రెయిన్ దౌత్య కార్యాలయ సిబ్బంది అధికారులతో ఒలెనా జెలెన్ స్కీ సమావేశమయ్యారని అధికారులు తెలిపారు. అనంతరం వారు ప్రయాణిస్తున్న విమానం టోక్యోకు టేకాఫ్ అయింది.
Zelensky
Olena Zelenska
Ukraine
Japan
Jaipur Airport
India
Tokyo
Fuel Stop
VIP Lounge

More Telugu News