Revanth Reddy: కాసేపట్లో ఢిల్లీకి రేవంత్ రెడ్డి.. జంతర్ మంతర్ వద్ద ధర్నాలో పాల్గొననున్న సీఎం

Revanth Reddy Delhi Visit Jantar Mantar Dharna on BC Reservations
  • ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న పీసీసీ చీఫ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
  • బీసీ రిజర్వేషన్లపై ఢిల్లీలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా
  • పాల్గొననున్న రాహుల్, ప్రియాంక, ఖర్గే
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ఢిల్లీకి వెళుతున్నారు. ఈ మధ్యాహ్నం 1 గంటకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఆయన ఢిల్లీకి బయలుదేరుతారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేపు జంతర్ మంతర్ వద్ద నిర్వహించనున్న ధర్నాలో ఆయన పాల్గొంటారు. మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, మల్లికార్జున ఖర్గే, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తదితరులు పాల్గొననున్నారు. ఇప్పటికే టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లాల ముఖ్యనాయకులు ఢిల్లీకి చేరుకున్నారు.

మరోవైపు, బీసీ రిజర్వేషన్ల అంశంపై పార్లమెంట్ లో కాంగ్రెస్ ఎంపీలు వాయిదా తీర్మానాలు ఇవ్వనున్నారు.
Revanth Reddy
Telangana CM
Delhi
Jantar Mantar
BC Reservations
Congress Party
Rahul Gandhi
Priyanka Gandhi
Mallikarjun Kharge
Telangana News

More Telugu News