Amit Shah: హోంమంత్రిగా అమిత్ షా అరుదైన ఘనత.. అభినందించిన ప్రధాని మోదీ

Amit Shah Breaks Record as Longest Serving Home Minister
  • హోంమంత్రిగా అమిత్ షా ఖాతాలో అరుదైన రికార్డు
  • కేంద్ర ప్రభుత్వంలో సుదీర్ఘకాలం పనిచేసిన హోంమంత్రిగా గుర్తింపు
  • బీజేపీ సీనియర్ నేత ఎల్ కే అద్వానీ రికార్డును అధిగమించిన షా
  • ఎన్డీయే సమావేశంలో అమిత్ షాను ప్రత్యేకంగా అభినందించిన ప్రధాని
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు.  అత్యధిక కాలం పాటు కేంద్ర హోంమంత్రిగా పనిచేసిన నేతగా ఆయన నిలిచారు. ఈ సందర్భంగా మంగళవారం జరిగిన ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆయనను ప్రత్యేకంగా అభినందించారు.

మే 30, 2019న కేంద్ర హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అమిత్ షా, ఆగస్టు 4, 2025 నాటికి 2,258 రోజులు పూర్తి చేసుకున్నారు. దీంతో బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ పేరిట ఉన్న రికార్డును ఆయన అధిగమించారు. అద్వానీ గతంలో 2,256 రోజుల పాటు హోంమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన 1998 మార్చి 19 నుంచి 2004 మే 22 వరకు ఈ పదవిలో ఉన్నారు.

మంగళవారం పార్లమెంట్ లైబ్రరీ భవనంలో జరిగిన ఎన్డీయే సమావేశంలో ప్రధాని మోదీ.. అమిత్ షా సాధించిన ఈ మైలురాయిని ప్రస్తావిస్తూ ప్రశంసించారు. 

గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గోవింద్ బల్లభ్ పంత్ కూడా సుదీర్ఘకాలం హోంమంత్రిగా పనిచేశారు. ఆయన 1955 జనవరి 10 నుంచి 1961 మార్చి 7 వరకు ఆరేళ్లకు పైగా ఈ పదవిలో కొనసాగారు. ఇప్పుడు అమిత్ షా,  అత్యధిక కాలం పనిచేసిన కేంద్ర హోంమంత్రిగా కొత్త రికార్డును నెలకొల్పారు.

Amit Shah
Narendra Modi
Home Minister
Indian Politics
LK Advani
Rajnath Singh
Longest Serving
Jawaharlal Nehru
Indira Gandhi
BJP

More Telugu News