Gachibowli: గచ్చిబౌలిలో పిడుగు... హడలిపోయిన ప్రజలు

Gachibowli Hit by Lightning Strike People Panic
  • గచ్చిబౌలిలో తాటిచెట్టుపై పిడుగుపాటు
  • ఖాజాగూడ ల్యాంకో హిల్స్ సర్కిల్ వద్ద ఘటన
  • భారీ శబ్దంతో భయభ్రాంతులకు గురైన స్థానికులు 
  • పిడుగు ధాటికి మంటలు చెలరేగి కాలిపోయిన చెట్టు
  • జనసంచారం తక్కువగా ఉండటంతో తప్పిన పెను ప్రమాదం
హైదరాబాద్ మహానగరంలో సోమవారం సాయంత్రం కురిసిన వర్షం ఒక్కసారిగా భయానక వాతావరణాన్ని సృష్టించింది. నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఒకటైన గచ్చిబౌలిలో భారీ శబ్దంతో పిడుగు పడటంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఈ ఘటనతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.

వివరాల్లోకి వెళితే, గచ్చిబౌలి పరిధిలోని ఖాజాగూడ ల్యాంకో హిల్స్ సర్కిల్ వద్ద ఈ సంఘటన చోటుచేసుకుంది. అక్కడ ఉన్న హెచ్‌పీ పెట్రోల్ బంకుకు ఎదురుగా ఉన్న ఓ తాటిచెట్టుపై ఉరుములతో కూడిన వర్షం మధ్యలో ఒక్కసారిగా పిడుగు పడింది. పెను శబ్దంతో పాటు వెలుగులు విరజిమ్మడంతో సమీపంలోని వాహనదారులు, స్థానిక నివాసితులు తీవ్రంగా భయపడ్డారు. ఏం జరిగిందో తెలియక కొందరు భయంతో పరుగులు తీశారు.

పిడుగుపాటు తీవ్రతకు తాటిచెట్టు పైభాగంలో మంటలు చెలరేగి, చెట్టు పాక్షికంగా కాలిపోయింది. వర్షం కురుస్తున్న సమయం కావడంతో జనసంచారం కాస్త తక్కువగా ఉంది. దీంతో ఎవరికీ ఎలాంటి హాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నగర నడిబొడ్డున ఇలాంటి ఘటన జరగడంతో స్థానికంగా కాసేపు ఆందోళనకర వాతావరణం నెలకొంది.
Gachibowli
Hyderabad
thunderstorm
lightning strike
Khajaguda
Lanco Hills
HP petrol bunk
rain
weather
natural disaster

More Telugu News