ప్రతి భారతీయుడి ప్రశ్నలకు మోదీ ప్రభుత్వం సమాధానం అదే: జైరామ్ రమేశ్ విమర్శలు
- తిరస్కరించు, దృష్టి మరల్చు, అబద్ధం చెప్పు, సమర్థించు అనే విధానం అనుసరిస్తోందని ఎద్దేవా
- మన సైనికులు దేశం కోసం వీరోచితంగా పోరాడి ప్రాణాలను త్యాగం చేశారన్న రమేశ్
- చైనా మన భూభాగంలోకి చొరబడలేదని ప్రధాని క్లీన్ చిట్ ఇచ్చారని ఆరోపణ
దేశభక్తి కలిగిన ప్రతి భారతీయుడు అనేక ప్రశ్నలు లేవనెత్తినప్పటికీ, సమాధానాలు ఇవ్వడానికి బదులు, మోదీ ప్రభుత్వం గత ఐదేళ్లుగా 'తిరస్కరించు, దృష్టి మరల్చు, అబద్ధం చెప్పు, సమర్థించు' అనే విధానాన్ని అనుసరిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ విమర్శించారు. 2020లో గాల్వాన్ లోయలో మన సైనికులు దేశం కోసం వీరోచితంగా పోరాడి ప్రాణాలను త్యాగం చేశారని ఆయన అన్నారు. కానీ ఆ తర్వాత మాట్లాడిన ప్రధానమంత్రి, చైనా మన భూభాగంలోకి చొరబడలేదంటూ క్లీన్ చిట్ ఇచ్చారని ఆరోపించారు.
జవాబుదారీతనం నుంచి తప్పించుకోవడానికి మోదీ ప్రభుత్వం ఎలాంటి పరిస్థితినైనా సృష్టించగలదని జైరామ్ రమేశ్ మండిపడ్డారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌కు చైనా బహిరంగ మద్దతు ప్రకటించినప్పటికీ మోదీ నుంచి ఎటువంటి స్పందన లేదని ఆరోపించారు. చైనా మన భూభాగాన్ని ఆక్రమించిందని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన కొన్ని గంటల తర్వాత జైరామ్ రమేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు.