అసెంబ్లీ ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మెరుపు ధర్నా
- గాంధీ విగ్రహం ముందు ధర్నాకు దిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
- ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు వేయాలని నినాదాలు
- గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందించిన వైనం
తెలంగాణ అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మెరుపు ధర్నా నిర్వహించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వెంటనే అనర్హత వేటు వేయాలని ఈ సందర్భంగా వారు నినాదాలు చేశారు. సుప్రీంకోర్టు సూచనల మేరకు వెంటనే నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ ను కలిసేందుకు అసెంబ్లీలోని ఆయన కార్యాలయానికి వెళ్లారు. అయితే, స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో వారు గాంధీ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు వేయాలని నినాదాలు చేశారు. అనంతరం గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందించారు.