రాజకీయ విభేదాలను పక్కన పెట్టి కుటుంబ వేడుకకు హాజరైన శరద్ పవార్, అజిత్ పవార్
- రాజకీయంగా ప్రత్యర్థులుగా మారిన శరద్ పవార్, అజిత్ పవార్
- కుటుంబ వ్యవహారాల్లో మాత్రం శత్రుత్వం లేకుండా కొనసాగుతున్న వైనం
- మేనల్లుడు యుగేంద్ర పవార్ నిశ్చితార్థానికి తరలి వచ్చిన మొత్తం కుటుంబం
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చీలిక వచ్చి రెండు సంవత్సరాలు గడిచింది. ఈ క్రమంలో శరద్ పవార్, అజిత్ పవార్ రాజకీయ ప్రత్యర్థులుగా నిలిచారు. కానీ, వీరిద్దరూ కుటుంబ వ్యవహారాల్లో మాత్రం ఎలాంటి శత్రుత్వం లేకుండానే కొనసాగుతున్నారు. తాజాగా నిన్న పవార్ మేనల్లుడు యుగేంద్ర పవార్ కు తనిష్క కులకర్ణితో ముంబైలో నిశ్చితార్థం జరిగింది.
కులకర్ణి నివాసంలో జరిగిన సంప్రదాయ నిశ్చితార్థ వేడుకకు పవార్ కుటుంబం మొత్తం హాజరయ్యారు. శరద్ పవార్, అజిత్ పవార్‌తో పాటు, సుప్రియా సూలే, రోహిత్ పవార్ కూడా ఈ వేడుకకు తరలి వచ్చారు. ఈ సందర్భంగా జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ సుప్రియా సూలే ఈ వేడుక ఫొటోలను పోస్ట్ చేశారు.
"హృదయపూర్వక అభినందనలు, తనిష్క మరియు యుగేంద్ర! మీ ఇద్దరికీ జీవితాంతం ప్రేమ మరియు ఆనందం కలగాలని కోరుకుంటున్నాను. హృదయపూర్వక ఆతిథ్యం ఇచ్చినందుకు కులకర్ణి కుటుంబానికి ధన్యవాదాలు" అని ఆమె ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.