Tamannaah: స్పెషల్ జెట్ లో లిక్కర్ స్కామ్ నిందితుడితో హీరోయిన్ తమన్నా.. ఫొటో వైరల్

Tamannaah Travels with Liquor Scam Accused Venkatesh Naidu in Special Jet Photo Viral
  • లిక్కర్ స్కామ్ నిందితుడు వెంకటేశ్ నాయుడుతో తమన్నా
  • చెవిరెడ్డికి అత్యంత సన్నిహితుడు వెంకటేశ్ నాయుడు
  • వెంకటేశ్ నాయుడు నోట్ల కట్టలు లెక్కిస్తున్న వీడియో వైరల్
ఏపీలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ సంచలనం రేపుతోంది. ఇప్పటికే ఈ కేసులో పలువురు ప్రముఖులు అరెస్టయ్యారు. తాజాగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముఖ్య అనుచరుడు వెంకటేశ్ నాయుడు పేరు ప్రస్తుతం మారుమోగుతోంది. నోట్ల కట్టలను ఆయన లెక్కిస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. తాజాగా ప్రముఖ సినీ నటి తమన్నాతో ఆయన ఫొటోలు సంచలనంగా మారాయి. సినీ ప్రముఖులతో కూడా ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. 

తమన్నాతో కలిసి ప్రత్యేక జెట్ లో వెంకటేశ్ నాయుడు ప్రయాణించారు. ఈ సందర్భంగా వీరు దిగిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. తమన్నాకు, వెంకటేశ్ నాయుడుకి మధ్య ఉన్న సంబంధం ఏమిటనే విషయంపై టాలీవుడ్ లో కూడా చర్చ జరుగుతోంది. ఈ స్పెషల్ జెట్ ప్రయాణంపై తమన్నా ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
Tamannaah
Tamannaah Bhatia
Venkatesh Naidu
AP Liquor Scam
Chevi Reddy Bhaskar Reddy
YSRCP
Andhra Pradesh
Special Jet
Liquor Scam
Tollywood

More Telugu News