Mukhtar Ansari: నకిలీ పత్రాలతో తండ్రి ఆస్తిని కొట్టేసే యత్నం.. ముఖ్తార్ అన్సారీ కుమారుడి అరెస్ట్

Mukhtar Ansari Son Umar Arrested in Fake Documents Case
  • గ్యాంగ్‌స్టర్స్ యాక్ట్ కింద ముఖ్తార్ అన్సారీ ఆస్తుల స్వాధీనం
  • వాటిని విడుదల చేయాలంటూ కోర్టులో ఉమర్ అన్సారీ పిటిషన్
  • ఇందుకోసం తల్లి అఫ్షాన్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన వైనం
  • పరారీలో అఫ్షాన్.. ఆమె తలపై రూ. 50 వేల రివార్డు
తండ్రి ఆస్తులను తిరిగి పొందేందుకు కోర్టులో నకిలీ పత్రాలను సమర్పించారన్న ఆరోపణలపై గ్యాంగ్‌స్టర్ రాజకీయవేత్త ముఖ్తార్ అన్సారీ కుమారుడు ఉమర్ అన్సారీని ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల గుండెపోటుతో మరణించిన ముఖ్తార్ అన్సారీ ఆస్తులను ‘గ్యాంగ్‌స్టర్స్ చట్టం’ కింద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ ఆస్తులను విడుదల చేయాలంటూ అన్సారీ కుమారుడు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

ఇందుకోసం ఉమర్ తన తల్లి అఫ్షాన్ అన్సారీ నకిలీ సంతకాలతో కూడిన డాక్యుమెంట్లను కోర్టులో సమర్పించినట్టు పోలీసులు ఆరోపించారు. అఫ్షాన్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఆమె గురించి సమాచారం అందించిన వారికి రూ. 50 వేల రివార్డు ఇవ్వనున్నట్టు పోలీసులు ప్రకటించారు. 

ఫోర్జ్‌డ్ డాక్యుమెంట్లతో తండ్రి ఆస్తులను స్వాధీనం చేసుకోవాలన్న ఉమర్ అన్సారీ మోసం గురించి తెలిసిన వెంటనే మహమ్మదాబాద్‌ పోలీస్ స్టేషన్‌లో ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. అనంతరం ఘాజీపూర్‌ పోలీసులు లక్నోలో ఉమర్‌ను అరెస్ట్ చేశారు. 
Mukhtar Ansari
Umar Ansari
Afshan Ansari
Ghazipur Police
Fake documents
Property dispute
Gangster Act
Uttar Pradesh police
Crime news
Arrest

More Telugu News